పుష్ప2 కోసం సుకుమార్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా.. దిమ్మతిరిగి పోవాల్సిందే!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్( Allu Arjun ) హీరోగా నటించిన పుష్ప 2( Pushpa 2 ) సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు.

డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ రష్మిక( Rashmika ) హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాపై ఇప్పటికే భారీ స్థాయిలో అంచనాలు కూడా ఏర్పడ్డాయి మరికొన్ని గంటలలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

ఇక ఇటీవల  ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలను హైదరాబాదులో ఎంతో ఘనంగా నిర్వహించారు.

"""/" / ఇక ఇప్పటికే సినిమా నుంచి విడుదల చేసిన అప్డేట్ చూస్తుంటే ఈసారి అల్లు అర్జున్ బాక్స్ ఆఫీస్ వద్ద సరికొత్త రికార్డులను తిరగ రాస్తారని స్పష్టం అవుతుంది.

ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా కోసం డైరెక్టర్ సుకుమార్( Sukumar ) తీసుకున్న రెమ్యూనరేషన్ కి సంబంధించి ఒక వార్త సంచలనంగా మారింది.

ఈ సినిమా కోసం డైరెక్టర్ సుకుమార్ భారీ స్థాయిలోనే రెమ్యూనరేషన్ అందుకున్నట్టు సమాచారం.

ఈయన సుమారు 150 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారనీ, ఇది మాత్రమే కాకుండా పుష్ప 2 కి వచ్చే లాభాల్లోనూ సుకుమార్ వాటాదారుగా ఉన్నారు.

"""/" / సుకుమార్ ఇదివరకే వచ్చిన పుష్ప పార్ట్ 1 కి  నిర్మాణంలో చేయి వెయ్యలేదు కానీ పార్ట్ 2 కి మాత్రం మైత్రి మూవీ మేకర్స్ తో కలిపి సినిమా నిర్మాణంలో భాగస్వామ్యం అయ్యారు.

ఈ క్రమంలోనే ఈ సినిమాకు వచ్చే లాభాలలో భారీ స్థాయిలో వాటా ఉంటుందని తెలుస్తోంది.

ఈ లెక్కన ఈ సినిమా కోసం ఈయన సుమారు 200 కోట్ల వరకు రెమ్యూనరేషన్ అందుకుంటారు అనడంలో అతిశయోక్తి లేదు.

అయితే ఈ సినిమా కోసం గత ఐదు సంవత్సరాలుగా సుకుమార్ ఎంతో కష్టపడుతూనే ఉన్నారు.

ఆయన కష్టం ముందు ఈ రెమ్యూనరేషన్ ఏ మాత్రం సరిపోదని చెప్పాలి.

రేపే ప్రమాణ స్వీకారం .. ఎయిర్‌ఫోర్స్ వన్‌లో వాషింగ్టన్‌‌కు చేరుకున్న ట్రంప్