Sukumar : సుకుమార్ నెక్స్ట్ సినిమా ఎవరితో అంటే..?
TeluguStop.com
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న డైరెక్టర్లలో సుకుమార్( Sukumar ) టాప్ రేంజ్ లో దూసుకుపోతున్నాడు.
ఇక రాజమౌళి పాన్ వరల్డ్ లో దూసుకుపోతుంటే, సుకుమార్ మాత్రం పాన్ ఇండియా లో తన సత్తాని చాటుకుంటున్నాడు.
ఇక ఇప్పటికే పుష్ప సినిమాతో( Pushpa ) బాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తాన్ని షేక్ చేసిన సుకుమార్.
ఇప్పుడు పుష్ప 2( Pushpa 2 ) సినిమాతో మరొకసారి బాలీవుడ్ షేక్ చేయాలని చూస్తున్నాడు.
ఇక ఇలాంటి క్రమం లోనే సుకుమార్ తన నెక్స్ట్ సినిమాని ఎవరితో చేస్తున్నాడు అంటూ భారీ ఎత్తున అభిమానుల నుంచి ప్రశ్నలైతే వస్తున్నాయి.
ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం అయితే సుకుమార్ తన నెక్స్ట్ సినిమాని రామ్ చరణ్ తో చేయబోతున్నట్టుగా తెలుస్తుంది.
"""/" /
అయితే అది రంగస్థలం సినిమాకి సీక్వెల్ గా( Rangasthalam Sequel ) వస్తుందా, లేదంటే వేరే ఫ్రెష్ స్టోరీ తో సినిమా చేస్తాడా అనే విషయాలు ఇంకా తెలియాల్సి ఉండగా, ఇక సుకుమార్ తన నెక్స్ట్ సినిమాని పక్కాగా రామ్ చరణ్( Ram Charan ) తోనే చేయబోతున్నట్టు గా తెలుస్తుంది.
ఇక ఈ సినిమా చేయడానికి రామ్ చరణ్ కూడా చాలా ఉత్సాహన్ని చూపిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి.
ఎందుకంటే వీళ్ళిద్దరి కాంబినేషన్ వచ్చిన రంగస్థలం సినిమా ఇప్పటికే సూపర్ డూపర్ సక్సెస్ ని సాధించడమే కాకుండా ఇండస్ట్రీలో ఉన్న అన్ని రికార్డులను బ్రేక్ చేసింది.
"""/" /
కాబట్టి ఈ కాంబినేషన్ రిపీట్ చేయాలనే ఉద్దేశ్యం లో ఇద్దరు ఉన్నట్టుగా తెలుస్తుంది.
మరి వీళ్ళిద్దరూ కలిసి మరోకసారి ఇండస్ట్రీ రికార్డులన్నింటిని బ్రేక్ చేస్తారా అనే విషయాలు కూడా తెలియాల్సి ఉంది.
ఇక పుష్ప 2 సినిమా రిలీజ్ అయిన తర్వాత వీళ్ళ కాంబినేషన్ లో వచ్చే సినిమాను అఫీషియల్ గా అనౌన్స్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది.
ఇక ప్రస్తుతం రామ్ చరణ్ గేమ్ చేంజర్ తో( Game Changer ) పాటు, బుచ్చిబాబు సన దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు.
కాబట్టి ఈ రెండు సినిమాలు పూర్తి అయ్యే లోపు సుకుమార్ తను చేయబోయే సినిమా స్క్రిప్ట్ వర్క్ మొత్తం పూర్తి చేయబోతున్నట్టుగా తెలుస్తుంది.
గర్ల్‌ఫ్రెండ్ లేని వారికి అదిరిపోయే ఐడియా.. ఈ జపనీస్ వ్యక్తి క్రియేటివిటీ అదుర్స్ ..?