ఆర్య 2 తర్వాత మరో సారి కలవనున్న బన్ని-సుకుమార్!

అల్లు అర్జున్ కెరియర్ లో ఆర్య సినిమా ఎంత సూపర్ హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే.

ఆ సినిమా అల్లు అర్జున్ ని ఒక్కసారిగా స్టైలిష్ స్టార్ గా టాలీవుడ్ లో నిలబెట్టింది.

రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకి భిన్నమైన కతమతో వన్ సైడ్ లవ్ అనే కొత్త పాయింట్ తో వచ్చిన ఆ సినిమా అటు బన్నికి, ఇటు సుకుమార్ కి కెరియర్ పరంగా చాలా ప్లస్ అయ్యింది.

ఆ తరువాత వీరిద్దరి కలయికలో ఆర్య 2 అనే సినిమా వచ్చింది.ఇది ఆర్య అంత సూపర్ హిట్ కాకుండా డిఫరెంట్ స్క్రీన్ ప్లే తో నడుస్తూ బన్నికి స్టైలిష్ ఇమేజ్ ని తీసుకొచ్చింది.

ఇదిలా వుంటే మరల చాలా గ్యాప్ తర్వాత వీళ్ళిద్దరి కలయికలో మరో మూవీ ఒకే అయ్యింది.

ప్రస్తుతం అల్లు అర్జున్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తో సినిమా చేయడానికి రెడీ అయ్యాడు.

ఈ సినిమా త్వరలో సెట్స్ పైకి వెళ్ళే అవకాశం వుంది.ఇదిలా వుంటే మరో వైపు సుకుమార్ కూడా రంగస్థలం లాంటి సూపర్ హిట్ తర్వాత సూపర్ స్టార్ మహేశ్ తో సినిమా చేయాలని ఫిక్స్ అయ్యి వున్నాడు.

ఇది కూడా త్వరలో అధికారికంగా అనౌన్స్ చేసే అవకాశం వుంది.అయితే ఇంతలో బన్ని, సుకుమార్ కాంబినేషన్ లో సినిమాకి గ్రీన్ సిగ్నల్ పడిపోయింది.

మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమా నిర్మించడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తుంది.త్రివిక్రమ్ సినిమా తర్వాత ఇది సెట్స్ పైకి వెళ్ళే అవకాశం వున్నట్లు తెలుస్తుంది.