మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమాను పూర్తి సోషల్ మెసేజ్‌తో కూడిన మాస్ ఎంటర్‌టైనర్‌గా దర్శకుడు తీర్చిదిద్దుతున్నాడు.
కాగా ఈ సినిమా తరువాత చిరు ఓ మలయాళ చిత్ర రీమేక్‌లో నటించనున్నాడు.
మలయాళంలో సూపర్ సక్సెస్ అయిన ‘లూసిఫర్’ చిత్ర తెలుగు రీమేక్ హక్కులను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సొంతం చేసుకున్నాడు.
కాగా ఈ సినిమాను యంగ్ డైరెక్టర్ సుజీత్ డైరెక్ట్ చేస్తున్నాడు.అయితే ఈ సినిమా కథలో కొన్ని మార్పులు చేయాలని చిరు సూచించడంతో ఇప్పటికే ఓసారి కొన్ని మార్పులు చేసి కథ వినిపించాడు.
కానీ అది చిరుకు నచ్చలేదు.దీంతో ఇప్పుడు మరోసారి మార్పులు చేస్తున్నాడట.
అయితే సుజీత్ చేస్తున్న మార్పులు చిరుకు నచ్చకపోవడంతో ఈ సినిమా డైరెక్షన్ బాధ్యతలను వేరొక డైరెక్టర్‌కు ఇవ్వాలని చూస్తున్నాడట.
దీంతో సుజీత్ ఈ సినిమాపై పెట్టుకున్న బోలెడు ఆశలు ఆవిరికావడం ఖాయమని చిత్ర వర్గాలు అంటున్నాయి.
ఇక ఈ సినిమాను చరణ్ అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తుండగా, ఈ సినిమాలో చిరు ఓ సరికొత్త లుక్‌లో కనిపిస్తాడట.
కాగా ప్రస్తుతం ఆచార్య చిత్రంలో చిరు సరసన అందాల భామ కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోండగా ఈ సినిమాలో ఓ కేమియో పాత్రలో రామ్ చరణ్ నటించనున్నాడు.