ఏపీలో వైసీపీ బాధితులకు సుజనా అండ ? కానీ షరతులు వర్తిస్తాయ్ ? 

వైసీపీ ప్రభుత్వం పై రోజురోజుకు అనేక రకాల ఒత్తిళ్లు పెరిగిపోతున్నాయి.ఒకవైపు కేంద్ర అధికార పార్టీ బీజేపీ సహకారం ఉన్నా, లేనట్టుగా నే ఉండగా, మరోవైపు టీడీపీ  , జనసేన,  వామపక్ష పార్టీలు ఇలా అన్నివైపుల నుంచి జగన్ ప్రభుత్వంపై ముప్పేట దాడి జరుగుతోంది.

దీనికి తగ్గట్లుగానే ఏపీ ప్రభుత్వం అనేక లోపాలు ఉండడం,  వైసీపీ నాయకులు ఇష్టానుసారంగా వ్యవహారాలు చేస్తుండడం,  అనేక అక్రమాలకు పాల్పడటమే కాకుండా,  ఎదురు తిరిగిన వారిపై దాడికి దిగేందుకు కూడా వెనుకాడక పోవడం ఇలా ఎన్నో అంశాలు వైసీపీ ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారాయి.

కొద్ది నెలల క్రితం వరకు ఏపీ ప్రభుత్వం విషయంలో సానుకూలంగానే ఉన్నట్లుగా వ్యవహరించిన బీజేపీ ఇప్పుడు తన ఎదురుదాడి మరింత తీవ్రతరం చేయడంతో టీడీపీ  నుంచి బీజేపీ లో చేరిన రాజ్యసభ సభ్యులు లో ఉత్సాహం పెరిగింది.

ఇదే అదునుగా ఏపీ ప్రభుత్వంపై మరింత ఒత్తిడి పెంచి ప్రజా ఆగ్రహానికి గురయ్యే విధంగా చేయాలని డిసైడ్ అయినట్లు కనిపిస్తున్నారు.

  ఈ మేరకు ఎంపీ సుజనా చౌదరి ఇప్పుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు.

ఇకపై ఏపీలో వైసీపీ  నాయకులు ఎవరిపై వేధింపులకు దిగిన వారికి తాను అండగా ఉంటానని,  ఎవరు బెదిరింపులకు పాల్పడుతున్నారు ?  అసలు గొడవకు కారణం ఏమిటి అనే విషయాలను తనకు మెయిల్ చేయాలని సుజన కోరుతున్నారు.

Saveandhrapradesh2022@gmail!--com కి మెయిల్ ద్వారా బెదిరింపులకు గురైనవారు తమకు సంబంధించిన పూర్తి వివరాలను పంపిస్తే తాను భరోసా ఇస్తాను అంటూ సృజన ప్రకటించారు.

ఒంగోలులో మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి చేతుల్లో దెబ్బతిన్న గుప్త అనే వ్యక్తి విషయం లోను సుజన స్పందించారు.

అయితే ఇక్కడే సుజనా చౌదరి ఒక కీలకమైన షరతు పెట్టారు. """/" / ముందుగా బాధితులు తమపై వేధింపుల దాడులకు దిగిన వారిపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని , ఆ ఫిర్యాదు తాలూకా  కాఫీ లను తనకు పంపిస్తే, అప్పుడు మాత్రమే తాను చూసుకుంటానని సుజనా చౌదరి ప్రకటించడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఒకవేళ వైసీపీ  నాయకులు వేదింపులకు నిజంగా దిగితే, ఇప్పుడున్న పరిస్థితుల్లో బాధితులు పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు  చేయడం, పోలీసులు వైసీపీ నేతలపై కేసులు నమోదు చేయడం ఇవన్నీ చాలా క్లిష్టమైన ప్రక్రియ.

నేతాజీ సుభాష్ చంద్రబోస్ పాత్రలో యంగ్ టైగర్.. ప్రభాస్ ఎన్టీఆర్ కాంబో వేరే లెవెల్ అంటూ?