అక్కడ ఆత్మహత్య చేసుకుంటున్న పక్షులు!
TeluguStop.com
మన దేశంలో ఎన్నో వింతలు, విశేషాలు ఉన్నాయి.ఈ వింతలు మొత్తం కూడా చాలా విచిత్రంగా ఉంటాయి.
ప్రపంచంలో నిత్యం జరిగే విషయాలు ఎవరికీ అర్ధం కావు.అవి ఎందుకు ఆలా ఉన్నాయి అంటే ఎవరూ కూడా చెప్పలేరు.
అది అంతే అని సరిపెట్టుకోవాలి.అంతకు మించి మనం ఏమి చేయలేము.
ఇక ఇదిలా ఉంటె, కొన్ని ప్రాంతాల్లో దేవుడికి విచిత్రమైన పూజలు చేస్తుంటారు.కొన్నిచోట్ల దెయ్యాలు తిరుగుతాయని.
మరికొన్ని చోట్ల ఎప్పుడూ వర్షమే పడుతుందని.ఇలా మన దేశంలో వింతలు విశేషాలకు కొదువే లేదు.
ఓ ప్రదేశం గురించి ఇక్కడ తెలుసుకుందాం.అదో విచిత్రమైన ప్రాంతం.
అక్కడ పక్షులుఆత్మహత్య చేసుకుంటాయి.సాధారణంగా మనుషులు ఆత్మహత్య చేసుకోవడం మనం నిత్యం వార్తల్లో చూస్తుంటాం.
మనుషుల్లానే జంతువులు, పక్షులు కూడా ఆత్మహత్య చేసుకుంటాయా.? అని చాలా మంది ఆశ్చర్యపోవచ్చు.
కానీ ఇది నిజం.అసోం లోని ఓ గ్రామంలో పక్షులు ఆత్మహత్య చేసుకుంటున్నాయి.
సాధారణంగా పక్షులు వాటికి అనుకూలమైన వాతావరణంలో ఉండడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటాయి.
అందుకోసం ఏకంగా కిలోమీటర్ల దూరం వరకు ఎగురుకుంటూ వెళ్లి అక్కడ ఉంటాయి.ఈ క్రమంలోనే పక్షులు అలా వలసలు వచ్చినప్పుడు చూడటానికి ఎంతో అద్భుతంగా ఉంటుంది.
అయితే సాధారణంగా ఎక్కడైనా మంటలు చెలరేగుతున్నాయి అంటే పక్షులు ఆ మంటలకు ఆమడ దూరంలో ఉంటాయి.
ఎగిసిపడుతున్న మంటలను చూసి పక్షులు ఆ వైపు కూడా రావడానికి భయపడిపోతూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే.
కానీ అస్సాంలోని బోరెల్ కొండల మధ్య జాతింగా అనే గిరిజన గ్రామం ఉంటుంది.
అక్కడే జరిగే వింతల వల్ల ఈ గ్రామం ప్రసిద్ధి చెందింది.జాతింగా గ్రామాన్ని 'సూసైడ్ పాయింట్ ఆఫ్ బర్డ్స్' అని పిలుస్తారు.
గ్రామంలో పక్షులు ఆత్మహత్యలు చేసుకోవడమే ఇందుకు కారణం.ఏదో ఒకటి రెండు పక్షులు చనిపోయానుకుంటే పొరపాటే.
భారీ సంఖ్యలో పక్షులు ప్రాణాలు తీసుకుంటున్నాయి. """/" / స్థానికంగా ఉండే పక్షులు మాత్రమే కాదు.
విదేశాల నుంచి వలస వచ్చే పక్షులు కూడా ఆత్మహత్యకు పాల్పడుతున్నాయి.కాలానుగుణంగా కొన్ని విదేశీ పక్షులు మన దేశంలోకి వస్తాయి.
ఒకవేళ అవి పొరపాటున జాతింగా గ్రామానికి వస్తే.అంతే సంగతులు.
ఆత్మహత్య చేసుకొని చనిపోతాయి.ఈ గ్రామానికి రాగానే పక్షులు ఎక్కువ వేగంతో ఎగురుతాయి.
వేగంగా ముందుకు దూసుకెళ్తూ.భవనాలు, చెట్లను ఢీకొంటాయి.
అనంతరం తీవ్రంగా గాయపడి కిందపడిపోతాయి.ఆ తర్వాత ఎగురలేక అల్లాడిపోతాయి.
అనంతరం కాసేపటికే మరణిస్తాయి.దాదాపు 40 జాతుల స్థానిక, వలస పక్షులు ఇక్కడ ఆత్మహత్య చేసుకుంటున్నాయి.
కొన్ని ప్రాకృతిక కారణాల వల్ల జాతింగా (Jatinga Birds Death) గ్రామానికి ఇతర నగరాలు, గ్రామాలతో 9 నెలలుగా సంబంధాలు తెగిపోయాయి.
రాత్రిపూట ఈ గ్రామంలోకి ప్రవేశంపై నిషేధం ఉంది.రాత్రిళ్లు ఎవరూ ఇక్కడకు రాకూడదు.
ఐతే ఇక్కడ పక్షులు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నాయ దానికి రకరకాల కారణాలు వినిపిస్తున్నాయి.