Suhasini Son Nandan: సినిమాల కోసం పని చేయనున్న సుహాసిని కొడుకు..లండన్ నుంచి తండ్రి కోసం 500 కోట్లు ఎలా ఇచ్చారు ?
TeluguStop.com
సినీ ఇండస్ట్రీలో డైరెక్టర్ మణిరత్నం, సుహాసిని గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు.సుహాసిని ( Suhasini ) ఎన్నో సినిమాల్లో అద్భుతమైన పాత్రల్లో నటించి తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంది.
ఎంతో మంది స్టార్స్ తో సుహాసిని నటించారు.ఇక ఆమె భర్త డైరెక్టర్ మణిరత్నం( Maniratnam ) గురించి చెప్పాల్సిన అవసరం లేదు.
అరవై ఏళ్లు దాటినా ఏ మాత్రం తగ్గకుండా వరుసగా సినిమాలు తీస్తున్నారు.ఇప్పటి దర్శకులకు ఇన్స్పిరేషన్ గా నిలుస్తున్నారు.
ఇటీవల తన డ్రీం ప్రాజెక్ట్ అయినా పొన్నియిన్ సెల్వన్ రెండు పార్టులు తీసి అద్భుతంగా తీశారు.
పొన్నియిన్ సెల్వన్ సినిమా అద్భుతమైన విజయం సాధించాయి. """/" /
ఈ సినిమా భారీ బడ్జెట్ తో తీయగా ఈ సినిమా అద్భుతమైన కలెక్షన్స్ ని రాబట్టింది.
ఈ సినిమాకి మణిరత్నం భార్య కూడా దగ్గరుండి ప్రమోట్ చేసింది.అయితే మణిరత్నం, సుహాసిని మాత్రమే కాదు ఈ సినిమా కోసం వాళ్ళ కొడుకు కూడా పనిచేశారనే వార్త ఇప్పుడు ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది.
మణిరత్నం, సుహాసినికి 1992లో నందన్ ( Nandan ) పుట్టాడు.నందన్ చదువంతా అబ్రాడ్‌లోనే అయిపోయింది.
నందన్ తండ్రి డ్రీం ప్రాజెక్ట్ అయినా పొన్నియన్ సెల్వన్( Ponniyin Selvan ) కోసం పనిచేశారంట.
లైకా ప్రొడక్షన్స్ తో అసోసియేట్ అయ్యారట నందన్.ఆల్రెడీ పొన్నియిన్ సెల్వన్ రెండు పార్టుల కోసం దాదాపు 500 కోట్ల నిధులను మొబిలైజ్ చేశారట.
అంతేకాదు నందన్ కి పుస్తకాలూ కూడా రాసే అలవాటు ఉంది.లెనినిజమ్ మీద కూడా పుస్తకం రాసారు.
"""/" /
సుహాసిని మాట్లాడుతూ నందన్ కి వరల్డ్ హిస్టరీ( World History ) అంటే ప్రాణం అని చెబుతుంటారు.
సినిమాల్లోకి రావడం తన ఇష్టం అని చెప్పేవారు.ఇప్పుడున్న డెవలప్‌మెంట్స్‌ని బట్టి, నందన్ మెడ్రాస్ టాకీస్ నిర్వహణను చూసుకుంటారని తెలుస్తోంది.
అంతేకాదు తండ్రి చేస్తున్న సినిమాలన్నీ నందన్ దగ్గరుండి చూసుకుంటున్నారంట.పొన్నియన్ సెల్వన్ కి మణిరత్నం, సుహాసినితో పాటు ఇప్పుడు వారి అబ్బాయి కూడా పనిచేశారనే వార్త ఇప్పుడు వైరల్ అవుతుంది.
కానీ ఇప్పటివరకు నందన్ మాత్రం ఏ ఫంక్షన్స్ లో కనిపించలేదు.నందన్ చిన్నతనం నుంచి కొంచం సిగ్గరి.
కానీ నిర్ణయాల విషయంలో మాత్రం చాల ఖచ్చితంగా ఉంటాడు.కొన్నేళ్లు లండన్ లో( London ) పని చేసిన అనుభవం అయన సొంతం.
ఇక సుహాసిని మణిరత్నం ల వారసుడిగా నందన్ ఇండస్ట్రీ లో నిలదొక్కుకోవాలని ఆశిద్దాం.
షుగర్ లెవెల్స్ ను నియంత్రణలో ఉంచే బెస్ట్ అండ్ సింపుల్ వ్యాయామాలు ఇవే!