Suhasini Mani Ratnam : ఆ హీరో ఒడిలో కూర్చోవాలని చెబితే ఇబ్బంది పడ్డాను.. సుహాసిని సంచలన వ్యాఖ్యలు!
TeluguStop.com
టాలీవుడ్ ( Tollywood )ఇండస్ట్రీలో నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో సీనియర్ నటి సుహాసిని( Suhasini ) ఒకరు.
తెలుగు తమిళ భాష చిత్రాలలో నటిస్తూ నటిగా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.
ఇలా హీరోయిన్ గా ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగినటువంటి సుహాసిని ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి పలు సినిమాలలో కీలక పాత్రలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు.
ఇలా నటిగా పలు సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.
ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈమె చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
"""/" /
ఈ సందర్భంగా సుహాసిని మాట్లాడుతూ తాను హీరోయిన్గా చేసే సమయంలో ఒక సినిమా షూటింగ్ లో తాను ఎంతో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొన్నానని ఈమె తెలియజేశారు.
ఒక సినిమా షూటింగ్లో భాగంగా నన్ను హీరో ఒడిలో కూర్చోమని చెప్పారు.ఆ సన్నివేశం నాకు చాలా ఇబ్బందికరంగా అనిపించి నేను కూర్చొని చెప్పేసాను.
ఇది మన భారతదేశం మన దేశంలో ఇలాంటి తప్పులు నేను అసలు చేయనని కావలసి వస్తే సీన్ మార్చమని వారికి చెప్పాను.
మరొక సినిమాలో భాగంగా హీరో తీసుకొని తిన్నటువంటి ఎంగిలి ఐస్ క్రీమ్ ( Ice Cream ) నన్ను తినమన్నారు.
"""/" /
ఇలా హీరో తిన్న ఐస్క్రీమ్ నేను తినడం ఏంటి నాకు వేరే ఐస్క్రీమ్ అయినా మార్చండి లేకపోతే ఈ సీన్ అయినా తీసేయండి నేను మాత్రం ఈ సన్నివేషంలో ఆ హీరో తిన్నటువంటి ఐస్ క్రీమ్ తిననని చెప్పేశారు.
దాంతో కొరియోగ్రాఫర్ ఒక్కసారిగా షాక్ అయ్యారని సుహాసిని వెల్లడించారు అయితే హీరోయిన్ శోభన విషయంలో కూడా ఇలాగే జరిగితే ఆమె కూడా తిననని కావాల్సి వస్తే సీన్ మార్చమని చెప్పారు.
ఆ సమయంలో డైరెక్టర్ నువ్వేమైనా సుహాసిని అనుకుంటున్నావా అంటూ మాట్లాడారట వెంటనే శోభన( Sobhana ) నాకు ఫోన్ చేసి ఈ విషయం చెప్పడంతో సీన్ నచ్చకపోతే అసలు చేయను అనే విషయం అప్పుడు అందరికీ తెలిసిందని ఈమె తెలియజేశారు.
అల్లు అర్జున్ ను ఆదర్శంగా తీసుకుంటే అందరూ పాన్ ఇండియా హీరోలే అవుతారా..?