సుడిగాలి సుధీర్‌కు బొమ్మ చూపించిన ఆడియెన్స్
TeluguStop.com
బుల్లితెర నుండి వెండితెరపై హీరోగా పరిచయం అయ్యి సక్సెస్ అయినవారి సంఖ్య చాలానే ఉంది.
కాని అందరికీ ఈ అదృష్టం వరించదు.కొందరు హీరోగా తమను తాము చూసుకోవాలని అనుకునే వారు చేతులు కాల్చుకున్నారు.
తాజాగా వారిలో జబర్దస్త్ నుంచి హీరోగా వచ్చి చేతులు కాల్చుకున్నాడు సుడిగాలి సుధీర్.
జబర్దస్త్ కామెడీ షోలో మంచి ఫేం సంపాదించుకున్న సుధీర్ కామెడీతో జనాలను నవ్వించడంలో సక్సెస్ అయ్యాడు.
అయితే తనకు పేరు తీసుకొచ్చిన కామెడీని పక్కనబెట్టి హీరోగా అన్ని ఎమోషన్స్ పండిద్దామని ‘సాఫ్ట్‌వేర్ సుధీర్’ అనే సినిమాతో హీరోగా అవతారమెత్తాడు.
ఇటీవల రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది.సినిమాలో దమ్ము లేకపోవడం పక్కనబెడితే చాలా బోరింగ్‌గా ఉండటంతో ఈ సినిమాను చూసేందుకు జనాలు ఆసక్తి చూపించలేదు.
దీంతో ఈ సినిమా దారుణమైన ఫ్లాప్ మూవీగా నిలిచింది.ఈ సినిమాలో సుధీర్ సరసన ధన్య బాలకృష్ణ హీరోయిన్‌గా నటించింది.
ఇకపై బుల్లితెర నుంచి వెండితెరపై హీరోగా చేద్దామనుకునే వారికి సుధీర్ ఓ వార్నింగ్ ఇచ్చాడనే చెప్పాలి.
మరి సుధీర్ ఈ ఫెయిల్యూర్‌ను పట్టించుకోకుండా మళ్లీ సినిమావైపు అడుగులు వేస్తాడేమో చూడాలి.
High Roller Tipps & Casino-Chat-Etikette: Vergleichsanalyse Für Erfahrene Spieler In Deutschland