సుడిగాలి సుధీర్ ఇకపై మళ్లీ ఆ పని చేసుకోవాల్సిందేనా?
TeluguStop.com
స్టేజ్ కార్యక్రమాల్లో ఒకప్పుడు మ్యాజిక్ షో చేస్తూ కెరీర్ ను మొదలు పెట్టిన సుధీర్ జబర్దస్త్ ద్వారా సుడిగాలి సుధీర్ గా మారి బుల్లి తెరపై సూపర్ స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే.
సోషల్ మీడియాలో సుడిగాలి సుధీర్ కి ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
ఈటీవీలో వచ్చే ఏ షో లో అయినా సుడిగాలి సుధీర్ కనిపించేవాడు.కానీ ఇప్పుడు పరిస్థితి మారింది.
బుల్లి తెర నుంచి పూర్తిగా వెండి తెర కి షిప్ట్ అయ్యాడు.ఆయన నుంచి వచ్చిన సినిమా లు పెద్దగా ఆకట్టుకోవడం లేదు.
కానీ ఆయన బుల్లి తెరపై కూడా కనిపించడం లేదు.దాంతో ముందు ముందు ఆయన పరిస్థితి ఏంటి అంటూ ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు.
జబర్దస్త్ చేస్తున్న సమయంలో సినిమా ల్లో నటించాడు.ఆ సమయంలోనే ఆయన సినిమా లకు మంచి గుర్తింపు మరియు క్రేజ్ దక్కింది.
కానీ ఇప్పుడు ఆయన సినిమాలు చేయక పోవడం తో సినిమా లను కూడా జనాలు పట్టించుకోవడం లేదు.
"""/" /
తాజాగా కాలింగ్ సహస్త్ర అనే సినిమా తో సుధీర్ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
ఆ సినిమా ను జనాలు లైట్ తీసుకున్నారు.ముందు ముందు సుధీర్ నుంచి రాబోతున్న సినిమా లు కూడా జనాలు పట్టించుకుంటారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ఈ నేపథ్యం లో ఆయన నుంచి వస్తున్న సినిమాల కంటే కూడా ఆయన మళ్లీ బుల్లి తెరపై కనిపిస్తే చూడాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారట.
మరి సుడిగాలి సుధీర్ మళ్లీ బుల్లి తెరపై కనిపించే అవకాశాలు ఉన్నాయా అంటూ చాలా మంది ఆసక్తిగా చర్చించుకుంటూ ఉన్నారు.
సుధీర్ ప్రస్తుతం రెండు మూడు సినిమా లను విడుదల చేయడానికి లైన్ లో ఉంచాడు.
వాటి కి పెద్దగా బజ్ క్రియేట్ అవ్వలేదు.అందుకే విడుదల తర్వాత జనాలు చూస్తారా లేదా అనే అనుమానాలు ఉన్నాయి.
మరోసారి తన మ్యానరిజాన్ని చూపించడానికి సిద్దమైపోయిన ఉపేంద్ర