సీరియల్ నటితో సుడిగాలి సుధీర్ డ్యాన్స్.. జోడీ బాగుందంటూ కామెంట్స్!

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు జబర్దస్త్ కమెడియన్స్ సుడిగాలి సుధీర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

జబర్దస్త్ షో ద్వారా కమెడియన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్న సుడిగాలి సుధీర్ తనకంటూ ఒక బీభత్సమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ని ఏర్పరచుకున్నారు.

ఇక బుల్లితెర జంట రష్మీ, సుధీర్ ల గురించి ఆ జంట కి ఉన్న క్రేజ్ ఫ్యాన్స్ ఫాలోయింగ్ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

ఈ జంట రీల్ లైఫ్ లోనే కాకుండా రియల్ లైఫ్ లో కూడా ఒక్కటైతే చూడాలని ఎంతోమంది అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

ఇది ఇలా ఉంటే గత కొంతకాలంగా రష్మీ సుడిగాలి సుధీర్ కలిసి కనిపించడం లేదు అన్న విషయం తెలిసిందే.

సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా ఉండడం వల్ల సుడిగాలి సుధీర్ బుల్లితెరకు కొద్దిరోజుల పాటు గుడ్ బాయ్ చెప్పేసాడు.

సుధీర్ నటిస్తున్న సినిమాల షూటింగులు పూర్తి అవ్వడంతో ఇటీవలే మళ్లీ బుల్లితెర పైకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.

తాజాగా సోషల్ మీడియాలో సుధీర్ అభిమానులకు మరొక చక్కటి శుభవార్త అంటూ ఒక వార్త తెగ వైరల్ అవుతోంది.

అదేమిటంటే సుడిగాలి సుధీర్ ఒక అమ్మాయి తో కలిసి స్టేజిపై స్టెప్పులు వేశాడు.

మరి ఆ అమ్మాయి ఎవరు అన్న విషయానికి వస్తే.ఇటీవల స్టార్ మా లో మొదలైన కొత్త సీరియల్ పల్లకిలో పెళ్లికూతురు.

ఈ సీరియల్ హీరోయిన్ అయినా అతిధి పండిట్ తో కలిసి స్టెప్పులను ఇరగదీశాడు సుధీర్.

ఈ సీరియల్ ఆమె శశిరేఖ పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. """/"/ అయితే ఈమె నటిస్తున్న తొలి సీరియల్ ఇదే.

ఆ సీరియల్ లో ఆమె నటనతో కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటోంది.

ఇది ఇలా ఉంటే తాజాగా ప్రసారమైన స్టార్ మా పరివారం షోలో ఈ బుల్లితెర నటి తో కలిసి సుడిగాలి సుధీర్ స్టెప్పులను ఇరగదీశాడు.

అయితే సుడిగాలి సుదీర్ కు ఆమె కరెక్ట్ గా సెట్ అవ్వడంతో బుల్లితెరకు మరొక జోడి దొరికింది అంటూ పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

అంతేకాకుండా రాబోయే రోజుల్లో వీళ్ళిద్దరూ కలిసి షోలో సందడి చేస్తారు అంటూ కూడా వార్తలు వినిపిస్తున్నాయి.