సుడిగాలి సుధీర్ మనసు అంత మంచిదా.. త్వరలోనే వృద్ధాశ్రమం కట్టించనున్న జబర్దస్త్ కమెడియన్?

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు జబర్దస్త్ కమెడియన్ సుడిగాలి సుధీర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

జబర్దస్త్ కమెడియన్ గా సుడిగాలి సుదీర్ భారీగా పాపులారిటిని సంపాదించుకున్న విషయం తెలిసిందే.

కమెడియన్ గా, మెజీషియన్ గా, డాన్సర్ గా,యాక్టర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు సుధీర్.

ఇకపోతే సుడిగాలి సుధీర్ ప్రస్తుతం వెండితెర పై హీరోగా పలు సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే.

వెండి తెరపై హీరోగా నిలదొక్కుకోవడానికి గట్టిగానే ప్రయత్నిస్తున్నాడు.ఈ క్రమంలోని ఇటీవల బుల్లితెరకు గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే.

కాగా తాజాగా సుధీర్ మళ్లీ బుల్లితెర పైకి ఎంట్రీ ఇచ్చాడు.ఇటీవల శ్రీదేవి డ్రామా కంపెనీ షోకి ఎంట్రీ ఇచ్చిన సుధీర్ అతి త్వరలోనే జబర్దస్త్ షోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలిపాడు.

ఇకపోతే సుడిగాలి సుధీర్ నటించిన గాలోడు సినిమా త్వరలోనే ప్రేక్షకులు ముందుకు రానున్న విషయం తెలిసిందే.

ఇంకా ప్రస్తుతం సుధీర్ ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా విధివిధిగా ఉన్నాడు.

ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగానే తన లక్ష్యాల్ని ఆశయాన్ని చెప్పుకొచ్చాడు సుధీర్.

త‌న‌కు ఓ వృద్ధాశ్ర‌మం ఏర్పాటు చేయాల‌ని ఉంద‌ని, ఎప్ప‌టికైనా త‌న ల‌క్ష్యం అదేన‌ని, అందుకు సంబంధించిన స‌న్నాహాలు ఎప్పుడో ప్రారంభించేశాన‌ని తెలిపాడు సుధీర్.

చిరంజీవి, రజినీకాంత్,ప‌వ‌న్ క‌ల్యాణ్‌ లు తనకు స్ఫూర్తి అని ఎంత ఎత్తు ఎదిగితే అంత ఒదిగి ఉన్నారు.

"""/"/ స‌మాజానికి త‌గిన రీతిలో సేవ చేస్తున్నారు.నేనూ వారి బాట‌లోనే న‌డుస్తాను అని చెప్పుకొచ్చాడు సుధీర్.

ఓ వృద్ధాశ్ర‌మం ఏర్పాటు చేయాల‌న్న ఆలోచ‌న‌లో ఉన్నాను.ప్ర‌స్తుతానికి నా ముందున్న ల‌క్ష్యం అదే అని తెలిపాడు సుధీర్.

కాగా సుధీర్ ప్రస్తుతం రెండు మూడు సినిమాలు నటిస్తే బిజీ బిజీ గా ఉన్న విషయం తెలిసిందే.

మొన్నటి వరకు సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్న సుధీర్ ప్రస్తుతం మళ్లీ బుల్లితెర పైకి రీ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు.

కాలేయ సమస్యతో బాధ పడుతున్న చిన్నారికి సాయం చేసిన సాయితేజ్… ఈ హీరో గ్రేట్!