సుధీర్ స్పీడ్ తగ్గిందేంటి..?

సుడిగాలి సుధీర్( Sudigali Sudheer ) అంటూ జబర్దస్త్ షోతో సూపర్ పాపులర్ అయిన సుధీర్ ఆ తర్వాత హీరోగా కూడా ప్రమోట్ అయ్యాడు.

వాంటెడ్ పండుగాడ్, 3 ఇండియట్స్, సాఫ్ట్ వేర్ సుధీర్, గాలోడు( Gaalodu ) సినిమాల్లో నటించిన సుధీర్ ఆ తర్వాత సినిమాల దూకుడు తగ్గించాడు.

తను చేస్తున్న సినిమా ఏంటన్నది రిలీజ్ ముందు వరకు చాలా సీక్రెట్ గా ఉంచుతున్న సుధీర్ తన ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్ కి బాగా దూరమయ్యాడని చెప్పొచ్చు.

ఇదివరకు జబర్దస్త్, ఢీ షోలో ఉన్నప్పుడు సుధీర్ క్రేజ్ బాగా ఉండేది.కానీ ఎప్పుడైతే ఆ షోలని వదిలేసి వెళ్లాడో సుధీర్ గురించి మాట్లాడుకోవడం తగ్గింది.

"""/" / షోలు చేసినంత వేగంగా సినిమాలు చేయడం కుదరని పని.అందుకే సుధీర్ సినిమాల వల్ల అంత సందడి అనిపించట్లేదు.

సుధీర్ స్పీడ్ కి బ్రేకులు పడటంతో జబర్దస్త్( Jabardasth ) అతను అనవసరంగా వదిలి వచ్చాడని అనుకుంటున్నారు.

గాలోడు పర్వాలేదు అనిపించినా నెక్స్ట్ ఒక డిఫరెంట్ సినిమాతో సుధీర్ వస్తున్నాడని తెలుస్తుంది.

సుధీర్ స్టార్ రేంజ్ కి వెళ్లాలంటే వరుస సినిమాలు చేయాల్సిందే అని ఫ్యాన్స్ కోరుతున్నారు.

మళ్లీ సుధీర్ బుల్లితెర మీదకు రావాలని ఆయన ఫ్యాన్స్ కోరుతున్నారు.

శ్రీకాంత్ ఓదెల చిరంజీవి సినిమాతో భారీ సక్సెస్ కొడతాడా..?