అల్లు అర్జున్ కంటే సుడిగాలి సుధీర్ కే ఫ్యాన్స్ ఎక్కువ? ఆ ఓటింగ్ తో తేలిపోయిందిగా!

తెలుగు సినీ ప్రేక్షకులకు పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

ఇటీవల విడుదలైన పుష్ప సినిమాతో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ గా మారిన విషయం తెలిసిందే.

పుష్ప సినిమాకు గాను అల్లు అర్జున్ ఎన్నో అవార్డులను సొంతం చేసుకోవడంతో పాటుగా పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు.

ఇకపోతే సుడిగాలి సుధీర్ విషయానికి వస్తే జబర్దస్త్ షోతో కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న సుధీర్ ఒకవైపు కమెడియన్ గా ప్రేక్షకులను నవ్విస్తూనే మరొకవైపు యాంకర్ గా చేస్తూ హీరోగా వెండితెరపై తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు.

ఇది ఇలా ఉంటే తాజాగా అల్లు అర్జున్ సుధీర్ కి సంబంధించిన ఒక వార్త తెగ వైరల్ అవుతోంది.

మీకు ఎవరంటే ఇష్టం ఓపెన్ గా చెప్పండి అంటూ సుడిగాలి సుధీర్ అలాగే అల్లు అర్జున్ ఫోటోలను యూట్యూబ్ లో ఆన్లైన్ పోల్ పెట్టారు.

కాగా ఈ పోల్ లో మొత్తం 43,000 మంది ఓట్లు వేయగా అందులో సుడిగాలి సుధీర్ కు 69 శాతం ఓట్లు రావడంతో అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోతున్నారు.

అల్లు అర్జున్ కి కేవలం 31 శాతం మాత్రమే ఓట్లు రావడంతో పలువురు షాక్ అవుతున్నారు.

ఇందుకు సంబంధించిన స్క్రీన్ షాట్ ని ట్విట్టర్ లో షేర్ చేసి ట్రోలింగ్స్ చేస్తున్నారు.

ఇదేం క్రేజ్ రా బాబు అంటూ సుధీర్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

"""/"/ అయితే ఆ ఫోటోలో కింద కూడా సుధీర్ కే ఎక్కువగా అనుకూలంగా కామెంట్లు వినిపించడం విశేషం.

ఇటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా సుధీర్ సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడని, అందుకే సుధీర్ అంటే తమకు ఎంతో ఇష్టమైన అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

అంతేకాకుండా యూట్యూబ్ లో మీకు ఏ జోడి అంటే ఇష్టం అని రశ్మి,సుధీర్ అలాగే కృతి శెట్టి వైష్ణవ్ తేజ్ జోడీల ఫొటోస్ పెట్టగా సుధీర్ రష్మీ జంటకు 84 శాతం రాగా కృతి శెట్టి వైష్ణవ్ ల జంటకు కేవలం 16 శాతం మాత్రమే ఓట్లు పడ్డాయి.

దీన్నిబట్టి సుధీర్ కు ఏ రేంజ్ లో ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉందో అర్థమవుతోంది.

పొడవాటి జుట్టును కోరుకుంటున్నారా.. అయితే ఇది తెలుసుకోవడం మిస్ అవ్వకండి!