సుధీర్, అనసూయ, చంద్ర జబర్దస్త్ కు గుడ్ బై చెప్పడానికి అసలు కారణమిదే!
TeluguStop.com
జబర్దస్త్ షో ద్వారా గుర్తింపును సొంతం చేసుకున్న యాంకర్ గా అనసూయకు పేరు ఉంది.
దాదాపుగా తొమ్మిదేళ్ల నుంచి అనసూయ ఈ షోకు యాంకర్ గా వ్యవహరిస్తున్నారు.మధ్యలో కొన్ని నెలల పాటు ఈ షోకు దూరంగా ఉన్న అనసూయ మళ్లీ ఈ షోతో బిజీ అయ్యారు.
అయితే తాజాగా అనసూయ జబర్దస్త్ షోకు గుడ్ బై చెప్పి అభిమానులకు ఊహించని స్థాయిలో షాక్ ఇచ్చారు.
స్టార్ మా ఛానల్ లోని ప్రోగ్రామ్స్ తో బిజీ కావడం వల్లే అనసూయ ఈ నిర్ణయం తీసుకున్నారు.
జబర్దస్త్ షో ద్వారా గుర్తింపును సంపాదించుకున్న చమ్మక్ చంద్ర, సుడిగాలి సుధీర్ కూడా ఈ షోకు దూరమైన సంగతి తెలిసిందే.
అయితే ఇలా ఒక్కొక్కరు ఈ షోకు దూరం కావడానికి డబుల్ రెమ్యునరేషన్ కారణమని సమాచారం అందుతోంది.
హైపర్ ఆది, రామ్ ప్రసాద్ కూడా రాబోయే రోజుల్లో ఈటీవీ షోలకు దూరమైనా ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
ఈటీవీ ఛానల్ కు వరుసగా యాంకర్లు, కమెడియన్లు గుడ్ బై చెప్పడం వల్ల నష్టమే తప్ప లాభం ఉండదని చెప్పవచ్చు.
జబర్దస్త్ షోలో కొత్తవాళ్లు ఎంట్రీ ఇస్తున్నా వాళ్లు ప్రేక్షకులను మెప్పించడంలో ఫెయిల్ అవుతున్నారు.
ఈ ఎఫెక్ట్ జబర్దస్త్ షోతో పాటు అనుబంధ షోలపై కూడా పడుతుండటం గమనార్హం.
రోజా ఈ షోకు దూరం కావడం కూడా ఈ షోకు ఒకింత మైనస్ అయిందని సమాచారం అందుతోంది.
"""/"/
ప్రస్తుతం రష్మీ మాత్రమే ఈటీవీ ఛానెల్ లోని ప్రోగ్రామ్స్ తో బిజీగా ఉన్నారు.
రష్మీ కూడా రాబోయే రోజుల్లో ఈ షోకు గుడ్ బై చెబితే ఈటీవీకి కష్టకాలమే అని చెప్పవచ్చు.
కొన్నిరోజుల క్రితం యాంకర్ ప్రదీప్ కూడా ఈటీవీకి గుడ్ బై చెప్పారని వార్తలు వచ్చాయి.
ఈటీవీ జాగ్రత్త పడకపోతే మాత్రం టీఆర్పీ రేటింగ్స్ విషయంలో నష్టపోక తప్పదని చెప్పవచ్చు.
యూఎస్ సెకండ్ లేడీ ఉషా చిలుకూరిపై ట్రంప్ ప్రశంసల వర్షం