సుధీర్ బాబు ఇలా చేశాడేంటి.. ఫ్యాన్స్ అసంతృప్తి

మహేష్ బాబు బావ అయిన సుధీర్ బాబు హీరోగా వరుస సినిమా లు చేస్తున్నాడు.

లాక్ డౌన్ సమయంలో ఈయన చేసిన సినిమా శ్రీదేవి డ్రామా సెంటర్‌.ఆనంది హీరోయిన్‌ గా నటించిన ఈ సినిమా కు కరుణ కుమార్ దర్శకత్వం వహించాడు.

భారీ ఎత్తున అంచనాలున్న ఈ సినిమాను థియేటర్ల ద్వారా విడుదల చేయాలనుకున్నప్పటికి అప్పుడున్న పరిస్థితుల్లో జీ 5 సంస్థకు అమ్మేశారు.

వారు స్ట్రీమింగ్‌ కు ఇన్ని రోజులు వాయిదా వేసి దీపావళికి స్ట్రీమింగ్‌ చేసేందుకు సిద్దం అయ్యారు.

ఇప్పుడు థియేటర్లు నూరు శాతం ఆక్యుపెన్సీతో భారీ ఎత్తున మునుపటి మాదిరిగా రన్‌ అవుతున్నాయి.

ఇలాంటి సమయంలో శ్రీదేవి సోడా సెంటర్‌ ను థియేటర్ల ద్వారా విడుదల చేస్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం అయ్యింది.

కాని జీ 5 వారు మాత్రం ఈ సినిమా ను ఓటీటీ ద్వారానే స్ట్రీమింగ్‌ చేయాలనే పట్టుదలతో ఉన్నారని తెలుస్తోంది.

ఇప్పటికే సినిమాను అమ్మేసిన కారణంగా ఏమీ చేయలేమని కొందరు అంటూ ఉంటే కొందరు మాత్రం సుధీర్ బాబు వల్లే ఇలా జరిగిందని అంటున్నారు.

సుధీర్ బాబు తల్చుకుంటే పెద్ద సమస్య ఏమీ కాదని.సుధీర్ బాబు ఈ సినిమా ను థియేటర్ల ద్వారా కాకుండా ఓటీటీ ద్వారా విడుదల చేయాలి అనుకోవడం చాలా పెద్ద తప్పుడు నిర్ణయం అంటూ అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

"""/"/ భారీ ఎత్తున ఈ సినిమా కు వసూళ్లు వస్తాయని అనుకుంటే ఇలా అయ్యింది ఏంటీ అంటూ కొందరు కామెంట్స్ చేస్తుంటే మరి కొందరు మాత్రం హీరో ది ఏముంది పాపం.

నిర్మాతల ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో వారు సినిమా ను ఇచ్చేసి ఉంటారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

అలా సుధీర్‌ బాబు మరియు ఆనంది ల కాంబోలో రూపొందిన శ్రీదేవి సోడా సెంటర్‌ ఓటీటీ ద్వారా విడుదలకు సిద్దం అయ్యింది.

ఇక మీదట అనంత్ శ్రీరామ్ కి పెద్ద సినిమాలకి పాటలు రాసే అవకాశం వస్తుందా.?