ఇంట్రో కోసం రెండు కోట్లు.. సుధీర్ బాబుతో పాట్లు!

నేచురల్ స్టార్ నాని, యంగ్ హీరో సుధీర్ బాబు కలిసి నటిస్తున్న చిత్రం ‘వి’ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.

ప్రముఖ దర్శకుడు మోహన్ కృష్ణ ఇంద్రగంటి డైరెక్షన్‌లో ఈ సినిమా తెరకెక్కుతుండటంతో ప్రేక్షకుల్లో ఈ సినిమాపై మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి.

ఇక రీసెంట్‌గా ఈ సినిమాలోని సుధీర్ బాబు, నానిల ఫస్ట్‌లుక్ పోస్టర్స్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేయడంతో అంచనాలు మరింత పెరిగాయి.

కాగా ఈ సినిమాలో హీరోగా సుధీర్ బాబు కనిపిస్తాడని, విలన్ పాత్రలో నాని కనిపిస్తాడని చిత్ర యూనిట్ తెలిపింది.

దీంతో ఈ సినిమాపై మరింత ఆసక్తి పెరిగింది.అయితే ఈ సినిమాలో సుధీర్ బాబు ఇంట్రొడక్షన్ సీన్‌ను భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు చిత్ర యూనిట్.

ఏకంగా ఈ సీన్ కోసం రూ.2 కోట్లు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది.

పాతబస్తీలో ఓ పోలీస్ సెట్‌ను దీని కోసం రూపొందించారట చిత్ర యూనిట్.ఇక్కడ ఓ భారీ యాక్షన్ ఎపిసోడ్‌ను చిత్రీకరించనున్నారట చిత్ర యూనిట్.

ఈ సీన్‌లోనే సుధీర్ బాబు ఎంట్రీ ఉంటుందని, నానితో ఆయన చేసే యాక్టింగ్‌కు ఫుల్ మార్కులు పడతాయని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ఇక ఈ సినిమాలో హీరోయిన్లుగా నివేదా థామస్, అదితి రావు హైదరీ నటిస్తుండగా స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్నాడు.

ఈ సినిమాను మార్చి 25న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.

పిన్నెల్లి పై అనర్హత వేటు వేయాలని డీజీపీకి ఫిర్యాదు చేసిన టీడీపీ నేతలు..!!