సుధీర్‌బాబుకు మరో 5 ఏళ్లు ఇబ్బంది లేదు
TeluguStop.com
మహేష్‌బాబు అండదండతో హీరోగా పరిచయం అయిన సుధీర్‌బాబు కెరీర్ ఆరంభం నుండి మంచి సక్సెస్‌లను దక్కించుకోవడంలో విఫలం అవుతూ వస్తున్నాడు.
మారుతి దర్శకత్వంలో వచ్చిన ‘ప్రేమకథా చిత్రమ్’ మినహా సుధీర్‌బాబుకు ఇప్పటి వరకు పర్వాలేదు అన్న సినిమానే పడలేదు.
ఇన్నాళ్లకు మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో వచ్చిన ‘సమ్మోహనం’ చిత్రం ఒక మోస్తరు సక్సెస్‌ను ఈయనకు తెచ్చి పెట్టింది.
అదితి రావుతో ఆ సినిమాలో ఈయన చేసిన రొమాన్స్ సినిమాకు హైలైట్‌గా నిలిచింది.
భారీ అంచనాల నడుమ రూపొందిన సమ్మోహనం చిత్రం అంచనాలను అందుకుంది. Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/
సుధీర్‌బాబు వరుసగా సినిమాలు చేయడం, అవి బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడటం జరుగుతుంది.
అయినా కూడా నిరాశ పడకుండా సినిమాలు అయితే చేస్తున్నాడు.సినిమాలు చేయగా చేయగా ఈయనకు ఆఫర్లు ఇచ్చేందుకు నిర్మాతలు ముందుకు రావడం లేదు.
దాంతో చేసేది లేక సొంతగా ఒక బ్యానర్‌ను ఈయన స్థాపించాడు.ఎస్‌బి పిక్చర్స్ అంటూ సుధీర్‌బాబు ప్రారంభించిన ఆ బ్యానర్‌లో ఇకపై వరుసగా సినిమాలు నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నాడు.
ఇలాంటి సమయంలో సమ్మోహనం చిత్రం సక్సెస్ అవ్వడంతో ఈయనతో సినిమాలు నిర్మించేందుకు నిర్మాతలు ఆసక్తి చూపుతున్నారు.
!--nextpage
మంచి కథతో సినిమాను చేస్తే సుధీర్‌బాబు కూడా సక్సెస్‌ను దక్కించుకుంటాడు అని, ఖచ్చితంగా సుధీర్‌బాబు కోసం మంచి స్క్రిప్ట్‌ను సిద్దం చేయించాలని కొందరు నిర్మాతలు ప్రయత్నాలు చేస్తున్నారు.
సొంత బ్యానర్‌లో చేయాల్సిన అవసరం లేకుండా నిర్మాతగా మారకుండా కూడా సుధీర్‌బాబు మరో అయిదు సంవత్సరాల పాటు ఇతర బ్యానర్‌లో హీరోగా చేసే అవకాశం సమ్మోహనం కలిగించింది.
మరో అయిదు ఆరు సినిమాలు ఫ్లాప్ అయినా కూడా పర్వాలేదు అన్నట్లుగా సుధీర్‌బాబు కెరీర్ మారిపోయింది.
వరుసగా సినిమాలు ఫ్లాప్ అయితే ప్రేక్షకులు ఆ హీరోను పట్టించుకోరు.కాని ఇలా అప్పుడప్పుడు సక్సెస్‌లు దక్కినా కూడా ఆ హీరోకు ఇండస్ట్రీలో మరియు ప్రేక్షకుల్లో గుర్తింపు ఉంటుంది.
అలాగే ఈ చిత్రంతో సుధీర్‌బాబుకు ఊపిరి అందినట్లయ్యింది.మరో వైపు మహేష్‌బాబు, కృష్ణల సపోర్ట్ ఈయనకు ఎలాగూ ఉంటుంది.
కనుక సుధీర్‌బాబు మరో అయిదు సంవత్సరాల పాటు హీరోగా కొనసాగే బూస్ట్ దక్కిందని చెప్పుకోవచ్చు.
ఇప్పుడైనా సుధీర్‌బాబు వరుసగా సమ్మోహనం వంటి సినిమాలు చేసి సక్సెస్‌లను దక్కించుకుంటాడేమో చూడాలి.
మా అమ్మ గురించి మీకేం తెలుసు.. పవిత్ర గౌడ కూతురు ఎమోషనల్ కామెంట్స్ వైరల్!