ఆ తప్పు వల్లే నా సినిమాలు ఫ్లాప్ అయ్యాయేమో.. సుధీర్ బాబు కామెంట్స్ వైరల్! 

ఎస్ ఎస్ సి బ్యానర్ పై సుమంత్ నాయుడు నిర్మాతగా సుధీర్ బాబు( Sudheer Babu ) హీరోగా నటిస్తున్న మూవీ హరోం హర.

( Harom Hara Movie ) ఈ సినిమాకి సెహరీ ఫేమ్ జ్ఞాన సాగర్ ద్వారక దర్శకత్వం వహిస్తున్నారు.

మాళవికా శర్మ( Malavika Sharma ) హీరోయిన్ గా నటిస్తుండగా సునీల్ కీలక పాత్రలో నటిస్తున్నాడు.

1989లో చిత్తూరు జిల్లా కుప్పం నేపథ్యంలో సాగే పిరియాడికల్ ఫిల్మ్ ఈ హరోం హర.

ఈ సినిమా కోసం సుధీర్ బాబు పూర్తిగా మేకోవర్ అయ్యాడు.అంతేకాకుండా కుప్పం స్లాంగ్ లో డైలాగులు కూడా చెప్పాడు.

పాన్ ఇండియా స్టోరీ( Pan India Story ) నేపథ్యంలో సుధీర్ 18 గా వస్తున్న హరోం హర కాన్సెప్ట్, టైటిల్, వీడియో పోస్టర్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే.

ఈ సినిమాని నటుడు కృష్ణ జయంతి సందర్భంగా మే 31న విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు.

ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు సుధీర్ బాబు.

"""/" / సినిమా ప్రచారంలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సుధీర్ బాబు తన కెరీర్ ని సమీక్షించుకున్నారు.

మీరు నటించిన సినిమాలలో అంచనాలను అందుకోలేక పోయినా సినిమా ఏది అని విలేకరి ప్రశ్నించగా ప్రేమ కధా చిత్రం( Prema Katha Chitram ) తప్పితే మిగిలిన అన్ని సినిమాల ఫలితాల విషయంలోనూ నేను నిరుత్సాహపడ్డాను.

భలే మంచి రోజు, సన్మోహనం, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి ఇలాంటి సినిమాలన్నీ కమర్షియల్ గా ఇంకా బెటర్ గా ఉండాల్సిన చిత్రాలు.

"""/" / వాటిని ప్రేక్షకులకు చేరువ చేయడంలో నేను ఫెయిల్ అయ్యాను అనిపిస్తుంది.

అందుకే ఈ సినిమాలు టెక్నికల్ గా ఆశించిన ఫలితం ఇవ్వలేదు అన్నారు సుధీర్ బాబు.

మహేష్ బాబు తో( Mahesh Babu ) మల్టీ స్టార్ చిత్రం ఎప్పుడు అని అడిగిన ప్రశ్నకు సమాధానం గా అలాంటి అవకాశం కోసం తాను కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని అయితే మల్టీస్టారర్ గురించిన చర్చ ఇప్పటివరకు మా మధ్య జరగలేదని, ఏదో ఒక రోజు జరగవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు సుధీర్ బాబు.

సొంత అక్కకే పోటీగా నిలిచిన జయమాలిని.. జ్యోతిలక్ష్మి లాస్ట్ డేస్ ఎలా గడిచాయంటే..??