గోవాలో కృతి శెట్టితో సుధీర్ బాబు రొమాన్స్.. ఆమె గురించి చెప్పాలంటూ?

గోవాలో కృతి శెట్టితో సుధీర్ బాబు రొమాన్స్ ఆమె గురించి చెప్పాలంటూ?

డైరెక్టర్ ఇంద్రగంటి మోహనకృష్ణ సినిమా అంటే అందరికీ ఒక అవగాహన ఉంటుంది.ఈయన సినిమాలు ప్రతి ఒక్క ప్రేక్షకుడిని ఆకట్టుకునే విధంగా సినిమాలను తెరకెక్కిస్తారని అందరూ అభిప్రాయపడతారు.

గోవాలో కృతి శెట్టితో సుధీర్ బాబు రొమాన్స్ ఆమె గురించి చెప్పాలంటూ?

అయితే ఇంద్రగంటి మోహనకృష్ణ సుధీర్ కాంబినేషన్ లో ఇప్పటి వరకు రెండు చిత్రాలు తెరకెక్కాయి.

గోవాలో కృతి శెట్టితో సుధీర్ బాబు రొమాన్స్ ఆమె గురించి చెప్పాలంటూ?

వీరిద్దరి కాంబోలో వచ్చిన మొదటి చిత్రం సమ్మోహనం పరవాలేదనిపించుకున్నప్పటికీ, వీ చిత్రం మాత్రం బాక్సాఫీసు వద్ద బెడిసికొట్టింది.

వీ చిత్రాన్ని ఒక ప్రయోగాత్మక చిత్రంగా తన జోనర్లో కాకుండా తెరకెక్కించడంతో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది.

ఇదిలా ఉండగా తాజాగా ఇంద్రగంటి మోహన కృష్ణ సుధీర్ బాబు కాంబినేషన్ లో ముచ్చటగా మూడో సారి తెరకెక్కుతున్నటువంటి చిత్రం "ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి".

ఈ సినిమాను బెంచ్ మార్క్ స్టూడియోస్ బ్యానర్ పై గాజులపల్లె సుధీర్ బాబు, సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని కిరణ్ బంల్లపల్లి, మహేంద్ర బాబు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఇందులో సుధీర్ బాబు సరసన ఉప్పెన హీరోయిన్ కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్నారు.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులను శరవేగంగా జరుపుకుంటుంది. """/"/ ప్రస్తుతం ఈ చిత్ర బృందం ఓ పాట చిత్రీకరణలో భాగంగా చిత్రబృందం గోవా వెళ్ళినట్లు సమాచారం.

గోవాలో సుధీర్ బాబు కృతి శెట్టి పై ఒక రొమాంటిక్ సాంగ్ ను చిత్రీకరించనున్నారు.

సాధారణంగా ఇంద్రగంటి మోహన కృష్ణ సినిమా అంటే ఈ విధమైనటువంటి రొమాంటిక్ సన్నివేశాలు, హంగు, ఆర్భాటాలు ఏమీ ఉండవు.

అయితే ఈ చిత్రం ద్వారా దర్శకుడు ఇంద్రగంటి మోహన కృష్ణ ఏ విధమైనటువంటి మ్యాజిక్ చేస్తారని ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

ఇక సుధీర్ బాబు విషయానికి వస్తే తాజాగా శ్రీదేవి సోడా సెంటర్ సినిమా ద్వారా విజయాన్ని అందుకున్న సుధీర్ తర్వాత ఆ అమ్మాయి గురించి చెప్పాలి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్24, గురువారం 2025