అందరు వెనకడుగు వేస్తున్న పాత్రకు ఓకే చెప్పిన మహానటి!
TeluguStop.com
మన ఇండియన్ సినిమా దగ్గర లేడీ డైరెక్టర్లు చాలా తక్కువ మంది ఉన్నారు.
వారిలో ది బెస్ట్ డైరెక్టర్ గా కొనసాగుతున్న లిష్టులో సుధా కొంగర టాప్ ప్లేస్ లో ఉంది.
ఈమె ఎంచుకునే కథలు చాలా డిఫరెంట్ గా ఎమోషనల్ గా ఉండడంతో ప్రేక్షకులు ఈమె తెరకెక్కిస్తున్న సినిమాలకు బ్రహ్మరథం పడుతున్నారు అనే చెప్పాలి.
అలాగే ఈమె సినిమాలోని పాత్రలు జనాలకు చేరువలో ఉండడంతో అవి గుర్తుండి పోతున్నాయి.
ఇటీవలే ఈమె తెరకెక్కించిన సినిమా నేషనల్ లెవల్లో అవార్డులు సైతం అందుకుంది.సూర్య హీరోగా తెరకెక్కిన ఆకాశమే నీ హద్దురా సినిమా ఎంత సెన్సేషనల్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
ఈ సినిమా 5 అవార్డులు అందుకుని అందరి చేత ప్రశంసలు దక్కించుకుంది.ఇక ఇదే సినిమాను ఈమె అక్షయ్ కుమార్ తో హిందీలో రీమేక్ చేస్తుంది.
అంతేకాదు సుధా కొంగర కు హోంబలే ప్రొడక్షన్స్ వారు భారీ ఆఫర్ ఇచ్చారు.
ఈ సినిమా గురించే అందరు చర్చించు కుంటున్నారు.ఈ సినిమా నిజ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా తెరకెక్కుతోందని వార్తలు నెట్టింట వైరల్ అవుతూనే ఉన్నాయి.
ఇక ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ గురించి మరో వార్త వైరల్ అవుతుంది. """/"/
ఈ సినిమాలో కీర్తి సురేష్ నటించ బోతుంది అంటూ ఈ వార్త సారాంశం.
ఈ సినిమా కోసం సుధా కొంగర చాలా మంది స్టార్ హీరోయిన్ లను సంప్రదించిందట.
కానీ ఎవ్వరూ కూడా ఈ కథలో నటించి రిస్క్ తీసుకోవాలని అనుకోలేదట.కానీ కీర్తి మాత్రం అందుకు ఒప్పుకుందని.
వీరు కూడా ఆలస్యం చేయకుండా ఈ ప్రాజెక్ట్ ను పట్టాలెక్కించ బోతున్నట్టు సమాచారం.
ఈ సినిమా భారీ స్థాయిలో పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కనుంది.చూడాలి కీర్తి నిజంగానే ఈ పాత్రను ఒప్పుకుందో లేదో.
ఇక ప్రెసెంట్ కీర్తి చేతిలో రెండు తెలుగు ప్రాజెక్ట్స్ ఉన్నాయి.భోళా శంకర్ లో నటిస్తుంది.
మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో చిరు కు చెల్లెలి పాత్రలో కీర్తి నటిస్తున్నట్టు ఇప్పటికే అఫిషియల్ గా ప్రకటించారు.
అలాగే నాని హీరోగా నటిస్తున్న దసరా సినిమాలో కూడా ఈ అమ్మడు హీరోయిన్ గా నటిస్తుంది.
వైరల్ వీడియో: అరటిపండ్లు అమ్మే వ్యక్తి దేశ పరువు మంటకలిపాడుగా!