బిగ్ బాస్ హోస్ట్ గా తప్పుకుంటున్నాను.. స్టార్ హీరో సంచలన పోస్ట్!

బుల్లితెరపై ప్రసారమవుతున్న అతిపెద్ద రియాలిటీ షో బిగ్ బాస్( Bigg Boss ) కార్యక్రమం అన్ని భాషలలోనూ ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

హిందీ,.తమిళం, కన్నడ, తెలుగు భాషలలో ఈ కార్యక్రమం ఎంతో విజయవంతంగా ముందుకు వెళుతుంది.

ఇక ఈ కార్యక్రమానికి తెలుగులో నాగార్జున( Nagarjuna ) వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు.ప్రస్తుతం తెలుగులో ఈ కార్యక్రమం 8వ సీజన్ ప్రసారం అవుతుంది.

ఇక తమిళంలో కూడా ఎనిమిదవ సీజన్ ప్రారంభం కాక ఈ కార్యక్రమానికి విజయ సేతుపతి హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు.

ఇక హిందీలో సల్మాన్ ఖాన్ కన్నడలో సుదీప్ కిచ్చా( Sudeep Kiccha ) వ్యాక్యతగా వ్యవహరిస్తున్నారు.

"""/" / ఇక కన్నడలో ఈ కార్యక్రమం 11వ సీజన్ ప్రసారం అవుతుంది.

అయితే ఈ కార్యక్రమం గురించి హీరో సుదీప్ సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.

తాను బిగ్ బాస్ హోస్ట్ ( Bigg Boss Host ) గా ఇదే ఆఖరి సీజన్ అంటూ ఈయన వెల్లడించారు.

గత పది సంవత్సరాలపాటు ఈ కార్యక్రమాన్ని ఎంతో విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు.

బిగ్ బాస్ కన్నడ 11కు మీరు ఇస్తున్న రెస్పాన్స్ కు థ్యాంక్స్.ఈ షోపై, నాపై మీరు చూపిస్తున్న ప్రేమకు టీవీఆర్ నిదర్శనం.

10 సంవత్సరాల పాటు ఈ ప్రయాణం ఎంతో గొప్పగా సాగింది. """/" / ఇప్పుడు నేను జీవితంలో నా తర్వాతి దశపై దృష్టి సారించాల్సిన సమయం వచ్చింది.

బిగ్ బాస్ హోస్ట్ గా ఇదే చివరి సీజన్.బిగ్ బాస్ ఫాలో అవుతున్న వాళ్లు, కలర్స్ వాళ్లు నా ఈ నిర్ణయాన్ని గౌరవిస్తారని అనుకుంటున్నాను.

ఈ సీజన్ ను అత్యుత్తమంగా మారుద్దాం.నేను కూడా మీకు సాధ్యమైనంత వినోదాన్ని అందిస్తాను.

అందరికీ థాంక్స్ అంటూ సుదీప్ ఈ సందర్భంగా చేసిన పోస్ట్ వైరల్ గా మారింది.

అయితే ఈయన ఉన్నఫలంగా ఈ షో నుంచి తప్పుకోవడానికి గల సరైన కారణం మాత్రం తెలియడం లేదు.

రాజమౌళి మాదిరిగానే గోపీచంద్ మలినేని కూడా మరో పాన్ ఇండియా డైరెక్టర్ అవుతాడా..?