సినిమా రిలీజ్ చెయ్యలేదని ఫ్యాన్స్ బీభ‌త్సం?

తమ అభిమాన హీరోల సినిమాల కోసం అభిమానులు బాగా ఎదురుచూస్తుంటారు.కొత్త సినిమాలు రావడమే ఆలస్యం.

వెంటనే విడుదల రోజు థియేటర్ల ముందు ఎదురుచూస్తుంటారు.కొన్ని కొన్ని సందర్భాలలో ఆ సినిమా ఆలస్యమైతే మాత్రం థియేటర్ల పై దాడి చేస్తుంటారు.

ఇదిలా ఉంటే తాజాగా తమ అభిమాన హీరో సినిమా విడుదల కాలేదని ఫ్యాన్స్ బీభత్సం సృష్టించారు.

కన్నడ సూపర్ స్టార్ హీరో సుదీప్ తాజాగా నటించిన సినిమా కోటిగొబ్బ -3.

ఇక ఈ సినిమాకు ఫైనాన్స్, కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల సినిమా విడుదల వాయిదా పడింది.

ఇక గతంలో ఈ సినిమాను గురువారం రోజు విడుదల చేస్తామని ప్రకటించగా నిన్న థియేటర్ దగ్గర అభిమానులు ఈ సినిమా కోసం తెల్లవారి నుంచి ఎదురు చూశారు.

"""/"/ దీంతో థియేటర్ లో ఈ సినిమా మధ్యాహ్నం కూడా విడుదల కాకపోయే సరికి అభిమానులు థియేటర్ల ఎదుట బీభత్సం సృష్టించారు.

థియేటర్ల పై రాళ్లను విసిరేశారు.ఇక సుదీప్ ఈ గొడవకు స్పందించి క్షమాపణలు తెలిపాడు.

ఈ సినిమా విడుదల సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేసే పనిలో ఉన్నామని ఈ సినిమా శుక్రవారం రోజు విడుదలవుతుందని తెలిపాడు.

ఇక ఇందులో థియేటర్ల యాజమాన్యం పై ఎటువంటి తప్పులేదని దయచేసి థియేటర్లపై దాడి చేయవద్దు అని అభిమానులను కోరాడు.

ఇటువంటి సమస్యలు మరోసారి జరగకుండా చూసుకుంటాను అని హామీ ఇచ్చాడు.ఇక తను కూడా ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నానని తెలిపాడు.

పుష్ప సినిమాతో నాకు వచ్చిందేమీ లేదు.. ఫహద్ ఫాజిల్ షాకింగ్ కామెంట్స్ వైరల్!