పునీత్ ఉంటే సమర్థించే వారా.... నటుడు దర్శన్ ఘటనపై సుదీప్ కామెంట్స్!
TeluguStop.com
కన్నడ సినీ నటుడు దర్శన్ కు దివంగత నటుడు పునీత్ రాజ్ కుమార్ అభిమానుల నుంచి చేదు అనుభవం ఎదురయింది.
సాధారణంగా సెలబ్రిటీలు, వారి అభిమానుల మధ్య పరస్పర భేదాలు ఉండడం సర్వసాధారణం.ఈ క్రమంలోనే పునీత్ దర్శన్ మధ్య చిన్నపాటి మనస్పర్ధలు కూడా ఉండేవని అయితే అభిమానులు మాత్రం నటుడు దర్శన్ పై ఓ సినిమా వేడుకలో భాగంగా ఏకంగా చెప్పుతో దాడి చేశారు.
ఇలా నటుడు పై చెప్పుతో దాడి చేయడంతో ఒక్కసారిగా ఈ విషయం కన్నడ చిత్ర పరిశ్రమలో చర్చలకు దారితీసింది.
ఈ క్రమంలోనే ఈ ఘటనపై పలువురు స్పందిస్తూ తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.ఇలా దర్శన్ ఘటనపై నటుడు కిచ్చా సుదీప్ స్పందించి తన అభిప్రాయాన్ని తెలియజేశారు.
ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా సుదీప్ ఈ ఘటనపై స్పందిస్తూ.మన నేల, భాషా, సంస్కృతి ప్రేమ గౌరవానికి ప్రతికలు ప్రతి సమస్యకు కూడా ఒక పరిష్కారం ఉంటుంది.
అయితే ఇలా ఒక నటుడు పై దాడి చేయడం భావ్యం కాదని అసలు ఇలా చేసినది కన్నడ ప్రేక్షకులేనా అనే సందేహం తనకు కలుగుతుందని ఈయన తెలియజేశారు.
దర్శన్ పునిత్ మధ్య ప్రశాంతకరమైన వాతావరణం లేదన్నమాట వాస్తవమే.అయితే పునీత్ ఉండి ఉంటే ఇలాంటి చేష్టలను సమర్థిస్తారా అని ఈయన ప్రశ్నించారు.
సమాధానం కూడా అందరికీ తెలుసని ఈయన చెప్పుకొచ్చారు. """/"/
సాధారణంగా సెలబ్రిటీల మధ్య చిన్నపాటి మనస్పర్ధలు ఉండటం సర్వసాధారణం.
కానీ ఒక సెలబ్రెటీ పట్ల ఇలా వ్యవహరించడం పూర్తిగా తప్పని తనకు పునీత్ దర్శన్ ఇద్దరు కూడా మంచి స్నేహితులు.
అందుకే దర్శన్ ఘటనపై తన అభిప్రాయాలను అందరితో పంచుకున్నానని ఈయన తెలియజేశారు.నేను ఈ విషయంలో ఎక్కువగా మాట్లాడి ఉంటే క్షమించండి అయితే ఒక విషయం గుర్తుంచుకోండి ఎవరికి ఏది శాశ్వతం కాదు ఇతరులను గౌరవించి ప్రేమిద్దాం తిరిగి వారి నుంచి అదే ప్రేమను గౌరవాన్ని పొందుదాం అంటూ ఈ సందర్భంగా సుదీప్ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
జైల్లో అడుగుపెట్టిన భారత సంతతి నేత ఈశ్వరన్.. ఖైదీగా అధికారులు ఏమిచ్చారంటే?