రూ.3 లక్షల అప్పుతో రూ.1300 కోట్ల సంపాదన.. అసిన్ భర్త సక్సెస్ స్టోరీ మీకు తెలుసా?
TeluguStop.com
తెలుగు సినీ ప్రేక్షకులకు హీరోయిన్ అసిన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.మొదట రవితేజ హీరోగా నటించిన అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి ప్రేమతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది.
ఈ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న అసిన్( Asin ) ఆ తర్వాత పలు సినిమాలలో నటించి మెప్పించింది.
ఇకపోతే ఈమె కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంలో రాహుల్ శర్మ అనే వ్యక్తిని పెళ్లి చేసుకొని వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టిన విషయం తెలిసిందే.
అసిన్ మనందరికీ సుపరిచితమే.ఆమె భర్త రాహుల్ శర్మ గురించి చాలామందికి పెద్దగా తెలియదు.
"""/" /
రాహుల్ శర్మ( Rahul Sharma ) ప్రముఖ ప్రారిశ్రామిక వేత్త.
వేలకోట్ల సామ్రాజ్యానికి అధినాయకుడు.మైక్రోమ్యాక్స్ కో-ఫౌండర్ అండ్ సీఈఓ( Micromax CEO ).
ఈయన తన స్నేహితులు రాజేష్ అగర్వాల్, వికాస్ జైన్, సుమీత్ అరోరాలతో కలిసి 2000లో మైక్రోమ్యాక్స్ ఇన్ఫర్మేటిక్స్‌ను స్థాపించారు.
అయితే ఇది ప్రారంభంలో ఐటీ సాఫ్ట్‌వేర్ కంపెనీ.ఆ తరువాత 2008లో మొబైల్ ఫోన్ మార్కెట్‌లోకి ప్రవేశించింది.
2010 నాటికి హ్యూ జాక్‌మాన్ బ్రాండ్ అంబాసిడర్ గా తక్కువ ధరలోనే ఫోన్‌లను అందించే సంస్థగా భారతదేశపు అగ్రగామిగా మారింది.
"""/" /
రాహుల్ శర్మ రాష్ట్రసంత్ తుకాడోజీ మహారాజ్ నాగ్‌పూర్ యూనివర్సిటీ నుంచి మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు.
ఆ తరువాత కెనడాలోని సస్కట్చేవాన్ విశ్వవిద్యాలయం నుంచి కామర్స్‌లో బ్యాచిలర్ డిగ్రీ పట్టా తీసుకున్నారు.
చదువు పూర్తయిన తరువాత రాహుల్ శర్మ తన తండ్రి నుంచి రూ.3 లక్షలు అప్పుగా తీసుకుని బిజినెస్ ప్రారంభించారు.
అలా ఒకప్పుడు 3 లక్షలతో వ్యాపారం మొదలుపెట్టిన ఆయన ప్రస్తుతం నికర విలువ ఏకంగా రూ.
1300 కోట్లు.ఈయన మైక్రోమ్యాక్స్‌తో పాటు 2017లో భారతదేశపు మొట్టమొదటి ఏఐ బేస్డ్ ఎలక్ట్రిక్ బైక్‌ను పరిచయం చేసిన రివోల్ట్ ఇంటెల్లికార్ప్ ఫౌండర్ కూడా రాహుల్ శర్మ.
కాగా రాహుల్ 2016లో ఆసిన్ ను పెళ్లి చేసుకున్నారు.ప్రస్తుతం ఈ జంటకు ఇప్పుడు అరిన్ రేన్ అనే కుమార్తె ఉంది.
వీరు ఢిల్లీలోని ఒక గ్రాండ్ ఫామ్‌హౌస్‌లో నివసిస్తూ విలాసవంతమైన జీవితం గడుపుతున్నట్లు సమాచారం.
వీరికి బెంట్లీ సూపర్‌స్పోర్ట్ లిమిటెడ్ ఎడిషన్, బీఎండబ్ల్యూ ఎక్స్6, మెర్సిడెస్ జీఎల్450, రోల్స్ రాయిస్ ఘోస్ట్ సిరీస్ 2 వంటి ఖరీదైన కార్లను కలిగి ఉన్నారు.
‘కిస్సిక్’ డ్యాన్స్ చేస్తే అమ్మ దెబ్బలు కొడుతుంది.. శ్రీలీల సంచలన వ్యాఖ్యలు !