ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లో కూడా సబ్స్క్రిప్షన్ ప్లాన్స్ రానున్నాయి, వారికోసమే!

సోషల్ మీడియా( Social Media ) దిగ్గజం మెటా.ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ గురించి ఇక్కడ ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన పనిలేదు.

ఇవి కూడా ఇపుడు సబ్స్క్రిప్షన్ ప్లాన్లు తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాయి.ఎటువంటి యాడ్లు లేకుండా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఉపయోగించాలంటే, కచ్చితంగా మంత్లీ సబ్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటుందని చెబుతున్నారు.

దీని వల్ల యూజర్లపై అదనపు ఆర్థిక భారం పడబోతుందని అర్ధం చేసుకోవాలి.మెటా సంస్థ.

ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ యూజర్లపై 14 డాలర్ల వరకు యాడ్-ఫ్రీ సబ్స్క్రిప్షన్( Ad-free Subscription ) ఛార్జీ విధించవచ్చు అనే సమాచారంను వాల్స్ట్రీట్ జర్నల్ పేర్కొంది.

"""/" / ప్రస్తుతం అమెరికాకు చెందిన ఈ టెక్ దిగ్గజాలు పరిశ్రమలో ఆరోగ్యకరమైన పోటీని తట్టుకోవడానికి ఈ సరికొత్త డిజిటల్ విధానాన్ని అనుసరిస్తున్నట్టు తెలుస్తోంది.

వాల్స్ట్రీట్ జర్నల్ ప్రకారం, ప్రస్తుతానికి యూరోపియన్ యూజర్లకు మాత్రమే ఈ సబ్స్క్రిప్షన్ ప్లాన్లను అమలు చేసే అవకాశం ఎక్కువగా కలదు.

వాల్స్ట్రీట్ జర్నల్ ప్రకారం, మొబైల్లో వాడే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ( Instagram )అకౌంట్లపై దాదాపు 13 యూరోల వరకు సబ్స్క్రిప్షన్ ఛార్జీ విధించే అవకాశం ఉంది.

"""/" / మెటా కంపెనీ సబ్స్క్రిప్షన్ ప్లాన్లను త్వరలోనే తీసుకు రానుంది.అయితే ప్రకటనలు వచ్చినా ఫర్వాలేదు అనుకునే వారు ఎలాంటి సబ్స్క్రిప్షన్ లేకుండానే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లను యదావిధిగా వాడుకోవచ్చు.

ఒక వేళ సబ్స్క్రిప్షన్ ప్లాన్ తీసుకుంటే.వారికి ఎలాంటి ప్రకటనలు రావు.

ఇకపోతే 2023వ సంవత్సరం మొదటి అర్థ భాగం నాటికి 258 మిలియన్ల మంత్లీ ఫేస్బుక్ ( Facebook )యూజర్లు ఉన్నారు.

అలాగే 257 మిలియన్ల మంత్లీ ఇన్స్టాగ్రామ్ యూజర్లు వున్నారనే విషయం విదితమే.ప్రస్తుతానికి సబ్స్క్రిప్షన్ ప్లాన్ అనేది యూరోప్కు మాత్రమే పరిమితం కాగా సమీప భవిష్యత్లో మిగతా దేశాలకు కూడా విస్తరించే అవకాశం లేకపోలేదు!.

అపరిచితుడు రీమేక్ కు నన్ను ఎందుకు తీసుకోలేదో.. విక్రమ్ షాకింగ్ కామెంట్స్ వైరల్!