నాలుగో టెస్టులో సెంచరీ తో అదరగొట్టిన శుబ్ మన్ గిల్.. త్రీ ఫార్మాట్ ప్లేయర్ గా అరుదైన రికార్డు..!

ఐపీఎల్, దేశవాళీ క్రికెట్ టోర్నీ లలో పర్ఫామెన్స్ ఇచ్చిన 23 ఏళ్ల కుర్రాడు భారత జట్టులో చోటు సంపాదించి వచ్చిన అవకాశాలను వినియోగం చేసుకొని సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నాడు.

భారత జట్టులో చేరిన కొద్ది కాలంలోనే త్రీ ఫార్మాట్ ప్లేయర్ గా ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.

నాలుగవ టెస్టులో ఓపెనర్ గా రోహిత్ శర్మ తో పాటు బరిలోకి దిగిన శుబ్ మన్ గిల్(Subhman Gill) 235 బంతుల్లో 128 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.

ఈ 2023 సంవత్సరం బాగా కలిసి వచ్చింది అనే చెప్పాలి.ఈ ఏడాది టీ20 తో అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టి, ఆరవ టీ 20 మ్యాచ్ లో సెంచరీ చేశాడు.

"""/" / ఇక న్యూజిలాండ్ తొ జరిగిన వన్డే మ్యాచ్లో డబల్ సెంచరీ చేసి ఖాతాలో మరో రికార్డు వేసుకున్నాడు.

తాజాగా ఆస్ట్రేలియాపై జరిగే నాలుగో టెస్ట్ లో సెంచరీ చేయడం వల్ల మూడు ఫార్మాట్లలో సెంచరీ పూర్తి చేసినా రికార్డ్ ఖాతాలో పడింది.

సురేష్ రైనా (Suresh Raina) 2010లో మూడు ఫార్మాట్లలో సెంచరీలు చేస్తే, కేఎల్ రాహుల్(KL Rahul) 2016లో మూడు ఫార్మాట్లలో సెంచరీలు, 2017లో టెస్ట్ మ్యాచ్లో సెంచరీ చేసి రోహిత్ శర్మ (Rohith Sharma) మూడు ఫార్మాట్లలో సెంచరీలు కంప్లీట్ చేశాడు.

"""/" / ఆ తర్వాత ఆరు సంవత్సరాలకు శుబ్ మన్ గిల్ వీరి జాబితాలో చేరాడు.

అంతేకాకుండా ఒకే ఏడాదిలో మూడు ఫార్మాట్లో సెంచరీ చేసిన మొదటి భారత ఓపెనర్ గా రికార్డ్ క్రియేట్ చేశాడు.

ఒకే సంవత్సరం మూడు ఫార్మాట్లో సెంచరీలు చేసిన వారిలో పదవ స్థానంలో నిలిచాడు.

23 ఏళ్ల వయసులో అత్యధిక అంతర్జాతీయ సెంచరీలు చేసిన మూడవ బ్యాటర్ గా నిలిచాడు.

నాలుగో టెస్టులో భారత్ ప్రస్తుతం మూడు వికెట్లు కోల్పోయి 289 పరుగులు చేసింది.

ఇంకా లక్ష్యానికి 191 పరుగుల దూరంలో ఉంది.

మీ జుట్టు మూడింతలు అవ్వాలా.. అయితే ఈ హెయిర్ మాస్క్ ను అస్సలు మిస్ అవ్వకండి!!