కూలి పనిచేసి,కూరగాయలమ్మి...పేదలకోసం హస్పటల్ నిర్మించిన మహిళ..

ప్రార్దించే పెదవుల కన్నా .సాయం చేసే చేతులు మిన్నా.

ఈ కొటేషన్ చదువుతున్నప్పుడల్లా నిజమే కదా అనిపిస్తుంది.కొందరు వ్యక్తుల్ని,వారు చేసే పనుల్ని చూస్తే ఛాతీ ఉప్పొంగుతుంది.

అలాంటి వ్యక్తే సుభాషిణి.సాయం చేయడానకి మన దగ్గర కోట్లకు కోట్లు డబ్బుండక్కర్లేదు.

చేయాలన్న ఆలోచన ఉంటే చాలు అని నిరూపించారామే.కూలి చేస్కుంటూ.

రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితిలో ఉన్న ఆమె హాస్పటల్ కడుతుందని,పేదలకు ఉచిత వైధ్యం అందిస్తుందని ఎవరూ ఊహించి ఉండరు.

అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన వెనుక సుభాషిణి గారి కష్టం ఉంది.ఆవిడ గురించి తెలియాలంటే చదవండి.

కలకత్తాకు చెందిన సుభాషిణి మిస్త్రీ భర్త సరైన వైద్యం అందక చనిపోయారు.మరణించేనాటికి అతని వయసు 23యేళ్లు.

భర్త చనిపోయిన క్షణంలోనే ఆమె ఒక నిర్ణయం తీసుకుంది.తన భర్తలాంటి పరిస్థితి మరెవరికి రాకూడదనుకుంది.

దానికోసం తనే ఏమైనా చేయాలని నిర్ణయించుకుంది.వెంటనే ఎప్పటికైనా పేదలకు ఉచితంగా వైధ్యం అందించే హాస్పటల్ నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

ఆ క్షణం భర్త గుర్తుగా మిగిలిన నలుగురు చంటిపిల్లలు తప్ప ఏ ఆస్తిపాస్తులు లేవు ఆమె దగ్గర.

అయినా కూడా లక్ష్యాన్ని పక్కన పెట్టలేదు.దానికోసం ఎంతో శ్రమించింది.

Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ మొదట ఇంటి దగ్గరున్న స్కూల్ లో ఆయాగా చేరింది.

మ‌రోవైపు కూర‌గాయ‌ల‌ను అమ్మింది.వచ్చిన సంపాదనతో ఇంటి ఖర్చులు వెల్లదీస్తూనే.

కొంత పొదుపు చేసింది.తర్వాత పిల్లలు కాస్త ఎదగడంతో సొతంగా ఇటుకలను తయారు చేయడం స్టార్ట్ చేసింది.

వ్యాపారం బాగా నడుస్తున్న క్రమంలో హాస్పిటల్ నిర్మాణం కోసం దాదాపు అర ఎకరం స్థలం కొన్నది.

తర్వాత హాస్పిటల్ నిర్మాణానికి విరాళాల కోసం బయలు దేరింది.చాలా మంది డబ్బును, కొంతమంది ఆసుపత్రి నిర్మాణానికి కావాల్సిన వస్తువులను, మరికొంత మంది వాలెంటరీగా కూలి పనికి వచ్చారు.

అతికష్టం మీద ఓ గది నిర్మించబడింది.అక్కడికి దగ్గర్లో ఉండే ముగ్గురు డాక్టర్లు తమ సమయానికి అనుగుణంగా ఫ్రీగా వైద్యం చేయడానికి ముందుకొచ్చారు.

ఈ విషయం గవర్నమెంట్ దృష్టికి రావడంతో 1996 లో వెస్ట్ బెంగాల్ గవర్నర్ అక్కడ ఓ పర్మినెంట్ బిల్డింగ్ కు శంకుస్థానపన చేశారు.

Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ ఇప్పుడు ఆ ఆసుపత్రి.అతి తక్కువ ధరకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తూ మంచి పేరును సంపాదించింది.

మరో ముఖ్యమైన విషయం ఏంటంటే సుభాషిణి చిన్న కొడుకు అజయ్ అందులో డాక్టర్ .

డాక్టర్ చదవడానికి అతడు పడిన కష్టం పేదలకు ఫ్రీగా వైద్యం చేస్తున్నప్పుడు కలిగే ఆనందంలో కొట్టుకుపోయిందంటాడు అజయ్.

తను నిర్మించిన హాస్పిటల్ ను చూసుకొని మురిసిపోతోంది సుభాషిణి.

పాన్ ఇండియా స్పూఫ్ లతో సుడిగాడు సీక్వెల్.. నరేష్ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ ఖాయమా?