శుభలేఖ సుధాకర్ కేవలం నటుడు మాత్రమే కాదు.. ఆయనలో ఈ కోణం కూడా ఉంది

సినిమాలో ఎంత బాగా నటించాము అనే దానికన్నా కూడా మన నటనకు సరిపడే డబ్బింగ్ ఎవరు చెప్పారు అనేది కూడా చాలా ముఖ్యం.

ఉదాహరణకు తెలుగు సినిమాల్లో శుభలేఖ సినిమాతో నటుడిగా ఎంట్రీ ఇచ్చి ఆ పేరునే తన ఇంటి పేరుగా మార్చుకున్న నటుడు శుభలేఖ సుధాకర్.

అయన తెలుగు మరియు తమిళ పరిశ్రమల్లో అనేక పాత్రలు పోషించారు.సినిమాలే కాకుండ బుల్లి తెరపై కూడా రెండు భాషల్లో శుభలేఖ సుధాకర్ చాల పాపులర్.

ఇక సుధాకర్ భార్య శైలజ సింగర్ బాలు చెల్లెలు అనే విషయం కూడా మనందరికి తెలిసిందే.

ఇక శుభలేఖ సుధాకర్ సినిమాల్లోకి రావడానికి చాల కష్టపడ్డారు.తొలుత ఎక్కువా తమిళ సినిమాల్లోనే కనిపించిన అయన ఆ తర్వాత తెలుగులోనూ బిజీ స్టార్ అయ్యాడు.

ఖచ్చితంగా హీరోగా కాకపోయినా భిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ స్టార్ యాక్టర్ గా మారారు.

అయన కెరీర్ లో రెండు జెల్ల సీత, సితార, శివ, ప్రేమ జిందాబాద్, నిర్ణయం, దొంగాట, చిత్రం భళారే విచిత్రం, ఆ నలుగురు వంటి సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు.

అయితే అయన కేవలం నటుడిగా మాత్రమే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా బాగా పాపుప్లర్ అయ్యారు.

"""/"/ ఒక వైపు నటిస్తూనే మరోవైపు గాత్రదానం చేస్తున్నారు.ఇక ఆయన కెజిఎఫ్ చిత్రంలో అనంత్ నాగ్ కి చెప్పిన డబ్బింగ్ కి మంచి పేరు వచ్చింది.

అనంత్ నాగ్ పాత్రకు అయన కేవలం తెలుగులో డబ్బింగ్ చెప్పారు.ఆ డబ్బింగ్ చెప్పిన విధానం ఎలా ఉందంటే గాయపడిన సింహం నుంచి వచ్చే శ్వాస గర్జన కన్నా భయంకరంగా ఉంటుంది.

ఆ వాయిస్ లో బేస్ అయితే పీక్స్ లో ఉందంటే ఆశ్చర్యం ఏమి లేదు.

ఇక తెలుగులో వి జగదీశ్ కి అన్ని తెలుగు చిత్రాల్లో డబ్బింగ్ శుభలేఖ సుధాకర్ చెప్తున్నారు.

తేజ్ ఐ లవ్ యు, టక్ జగదీష్, వరల్డ్ ఫెమస్ లవర్ వంటి సినిమాలకు మంచి పేరు వచ్చింది.

తలైవాసల్ విజయ్, శత్రుజ్ఞ సిన్హా, మధుసూదన్ రావు, నాజర్, రమేష్ ఖన్నా, సచిన్ కడేకర్, నెపోలియన్ వంటి బయట నటులకు తెలుగు లో గాత్ర దానం చేస్తున్నారు.

ఇక శైలజ కూడా పలువురు నటీమణులకు డబ్బింగ్ చెప్తుండటం విశేషం.

అయోధ్యలో తొలిసారి శ్రీరామనవమి వేడుకలు