Great Escape: ఆవు కడుపులోకి దూరి, చాకచక్యంగా తప్పించుకున్న ధైర్యశాలి?

ఆవు కడుపులోకి దూరి, చాకచక్యంగా తప్పించుకోవడమేమిటి? నాన్సెన్స్! అని అనుకుంటున్నారా? మీరు విన్నది నిజమేనండి.

ఇది జరిగింది.అతగాడికి స్టంట్స్ అంటే పిచ్చి.

ఎలాంటి స్టంట్‌నైనా అవలీలగా చేసిపడేస్తాడు.ఈ క్రమంలో ప్రాణాలకు తెగించి మరీ సాహసాలు చేస్తుంటాడు.

ఈ కారణంగానే అతడు డేర్ డెవిల్‌గా పేరు ప్రఖ్యాతలు గడించాడు.వివిధ టీవీ షోస్‌లో కూడా ఇతడు పాపులర్ అయ్యాడు.

అంతవరకూ బాగానే వుంది కానీ అతడు ఇటీవల ఎవరూ గుర్తించని ఓ భయానకమైన స్టంట్ గురించి ఓ మీడియా సంస్థకు తెలియజేశాడు.

ఈ సందర్భంగా అతడు చేసిన అసాధ్యమైన సాహసం గురించి చెప్పాడు.అదేమంటే, అతడు ఆవు కడుపులోకి దూరడం.

అవును.మీరు విన్నది నిజమే! అతడు ఆవు కడుపులోకి దూరాడు? అయినా, అదేలా అవుతుంది అని అనుకుంటున్నారు కదా.

అలా చేస్తే ఆవు చనిపోతుందనేగా మీ అనుమానం? మీ అనుమానం నిజమే.కాకపోతే ఇక్కడ అతడు చనిపోయిన ఆవు కడుపులోకి దూరాడు.

అయితే, అతడు ఆవు కడుపులోకి ఎలా దూరాడనే విషయం చెప్పలేదు.కానీ, ఎలా బయటకు వచ్చేడనేది మాత్రం చెప్పాడు మన స్టెంట్ మాస్టర్.

ఇతగాడి పేరు 'జోనాథన్ గుడ్విన్'. """/"/ మొదట గుడ్విన్.

ఓ తిమింగలం కడుపులోకి దూరాలని ప్లాన్ చేశాడు.స్క్రిప్ట్ ప్రకారం ఆ తిమింగలం కడుపుకోసి, చేతిని సంకెళ్లతో కట్టుకుని, తాళాలు వేసుకుని అతడు అందులోకి దూరాలి.

ఆ తర్వాత అతడిని లోపల పెట్టి కుట్టేస్తారు.అక్కడి నుంచి కౌంట్‌డౌన్ స్టార్ట్ అవుతుంది.

నిర్ధారించిన సమయంలో అతడు సంకెళ్లు విడిపించుకుని బయటకు రావాలి.అయితే, ఈ స్టంట్ చేయడానికి అతడికి ఎక్కడా తిమింగలం దొరకలేదు.

దీంతో ప్లాన్‌ను మార్చుకొని చనిపోయిన ఆవు కడుపులోకి దూరి తన కోరికను తీర్చుకున్నాడు.

చంద్రబాబు నమ్మదగిన వ్యక్తి కాదు..: జూ.ఎన్టీఆర్ మామ నార్నె శ్రీనివాసరావు