అమెరికాలో రవాణా వ్యవస్థపై అధ్యయనం:మంత్రి కోమటిరెడ్డి

నల్లగొండ జిల్లా: అమెరికా దేశ పర్యటనలో ఉన్న మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి కాలిఫోర్నియా రాష్ట్రంలోని ఆరెంజ్ కౌంటీలోని శాంటా అనా ప్రాంతంలో కాలిఫోర్నియా డిపార్ట్‌మెంట్ ఆఫ్ ట్రాన్స్‌పోర్టేషన్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ సెంటర్‌ను సందర్శించారు.

ట్రాఫిక్ నియంత్రణ వ్యవస్థలను గురించి అవలంబిస్తున్న విధివిధానాలను అక్కడ అధికారులను అడిగి తెలుసుకున్నారు.

తెలంగాణలో రహదారి భద్రత మరియు ట్రాఫిక్ సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి కాలిఫోర్నియాలో అవలభింస్తున్న టెక్నాలజీ తీరును పరిశీలిస్తామని ట్విట్టర్ వేదికగా చెప్పారు.