విద్యార్థిని విద్యార్థులు గుడ్ టచ్ బ్యాడ్ టచ్, పొక్సో యాక్ట్ లపై అవగాహన కలిగి ఉండాలి..
TeluguStop.com
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు "పొక్సో పై చైతన్యం" అవగాహన కార్యక్రమంలో భాగంగా వేములవాడ పట్టణ పరిధిలోని నంపెళ్లి వద్ద గల నిర్మలా ఉన్నత పాఠశాలలో బాల బాలికలకు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ ,ఫోక్సో చట్టం గురించి,పోక్సో చట్టం ప్రకారం అమలులో ఉన్న శిక్షల గురించి,సోషల్ మీడియా,సైబర్ క్రైమ్ ల వలన కలుగు అనర్ధాలపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ.జిల్లా పోలీస్ శాఖ విద్యార్థినుల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని,విద్యార్థులు జీవితంలో చక్కటి లక్ష్యాలను ఎన్నుకుని సరైన మార్గంలో శ్రమిస్తూ ఉన్నత శిఖరాలను చేరుకోలే తప్ప అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతూ తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దన్నరు.
విద్యార్థిని విద్యార్థులకు పొక్సో యాక్ట్, గుడ్ టచ్, బ్యాడ్ టచ్ లపై అవగాహన ఉండాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ "పొక్సో పై చైతన్యం" పేరుతో జిల్లాలో ఉన్న అన్ని పాఠశాలలో ,కలశాలలో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని, జిల్లాలో ఈ రోజు వరకు 65 పాఠశాలలు, కళాశాలలో పొక్సో యాక్ట్, గుడ్ టచ్, బ్యాడ్ టచ్ పై అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసి అవగాహన కల్పించడం జరిగిందన్నారు.
మైనర్ బాలికలు, చిన్నారుల పట్ల నేరాలకు పాల్పడే వారికి పోక్సో చట్టం ప్రకారం జీవిత ఖైదు వంటి కఠిన శిక్షలు పడే అవకాశం ఉందని,తద్వారా తమ విలువైన జీవితం అంతా జైల్లోనే మగ్గిపోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
చిన్నారులు తమకు ఇంట్లో,పాఠశాలలో,వీధుల్లో పొరుగువారితో ఎదురయ్యే రకరకాల వేధింపులు, అసభ్య ప్రవర్తన,గుడ్ టచ్ బ్యాడ్ టచ్ ల గురించి నిర్భయంగా తమ తల్లిదండ్రులకు తెలియజేయాలని,తల్లిదండ్రులు కూడా తమ పిల్లలతో స్నేహపూర్వకంగా వ్యవహరించాలని సూచించారు.
విద్యార్థులు సామాజిక మాధ్యమాల అయినా ఫేస్బుక్, వాట్సప్, ఇన్స్టాగ్రామ్ వంటి వాటిని వినియోగంలో చాలా జాగ్రత్తగా ఉండాలని ఫోటోలు, వీడియోలు పోస్ట్ చేసే సమయంలో వ్యక్తిగత భద్రతకు సంబంధించిన అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని తెలియజేశారు.
విద్యార్థినిలు మహిళలు మౌనం విడి ముందుకు వచ్చి సమస్యలు పరిష్కరించుకోవాలని,నిర్భయంగా ముందుకు వచ్చి మీ సమస్యలను చెప్పుకున్నాప్పుడే మరింత భద్రత కల్పించగలువుతామని, మహిళలు,విద్యార్థినిలు జిల్లా షీ టీమ్ నెంబర్ 8712656425 కు పిర్యాదు చేసినచో వారి మీద చట్టపరమైన చర్యాలు తీసుకోవడం జరుగుతుంది అని అన్నారు.
పిర్యాదు చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి పి లక్ష్మీరాజాం,షీ టీం ఏ.
ఐ ప్రమీల, షీ టీం సిబ్బంది రమాదేవి, ప్రియాంక,మహిళా సాధికారత కేంద్రం కోఆర్డినేటర్ రోజా ఐసిపిఎస్ సిబ్బంది సఖి సిబ్బంది,పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.
వీడియో: వీధుల్లో నడుస్తున్న యువతిని అసభ్యంగా తాకిన పదేళ్ల అబ్బాయి..