రోబో రిక్షా పుల్లర్ ను రూపొందించిన సూరత్ విద్యార్థులు..!

ప్రస్తుతం టెక్నాలజీ( Technology ) అన్ని రంగాల్లో వేగంగా అభివృద్ధి చెందుతూ కొత్త మార్పులను తీసుకువస్తోంది.

ముఖ్యంగా మనుషుల పనులను సులభతరం చేసే ఎన్నో పరికరాలు అందుబాటులోకి వస్తున్నాయి.అయితే సూరత్ విద్యార్థులు మనుషుల బదులు అన్నీ పనులు చేసే రోబో రిక్షా పుల్లర్ ను తయారు చేసి ఆదర్శంగా నిలిచారు.

"""/" / గుజరాత్ లోని సూరత్ కు చెందిన విద్యార్థులు హ్యూమన్ ఆపరేటర్ అవసరం లేకుండా వస్తువులను, ప్రజలను రవాణా చేయగల రోబో రిక్షా పుల్లర్ (Robot Rickshaw Puller )ను అభివృద్ధి చేసిన ప్రయోగం విజయవంతం అయ్యింది.

ఒక వ్యక్తి రిక్షాను ఎలా లాగుతాడో అచ్చం అలాగే ఈ రోబో కదలికలను అనుకరించేలా రూపొందించారు.

రోబో కు మోటారు, చక్రాలు అమర్చి ప్రత్యేకంగా తయారు చేయడానికి 25 రోజుల సమయం పట్టింది.

అంతేకాకుండా ఈ రోబో రిక్షాను తయారు చేయడం కోసం రూ.30 వేలు ఖర్చు అయ్యింది.

ప్రస్తుతం విద్యార్థులు ఈ రోబో రిక్షాకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియా( Social Media )లో అప్లోడ్ చేయడంతో వైరల్ అయింది.

"""/" / ఈ ప్రాజెక్టు చేపట్టిన విద్యార్థులు రోబో రిక్షా గురించి మాట్లాడుతూ.

మనిషి కాళ్లతో నడిచే విధానాన్ని లోతుగా అధ్యయనం చేసి ఈ రోబోను రూపొందించినట్లు తెలుపుతూ, రోడ్డుపై రోబో ను నడిపించే టెస్టులను విజయవంతంగా నిర్వహించామని తెలిపారు.

ఒక సాధారణ మానవుడు ఎలా నడుస్తాడో అచ్చం అలాగే నడిచే విధంగా ఈ రోబోను రూపొందించడానికి ప్రయత్నించామని, ఇంకా ఈ రోబో కాళ్ళు, చేతులు, తల, ముఖ భాగాలను అభివృద్ధి చేయాల్సి ఉందని తెలిపారు.

"""/" / స్మార్ట్ యంగ్ స్టర్స్ టెక్నాలజీని ఉపయోగించి అన్ని పనులను ఎంత సులభంగా చేయవచ్చో ఈ రోబో చూపిస్తుందని, ఇంకా మరిన్ని ఫీచర్లు ఈ రోబోకు జోడించాలని తెలిపారు.

ప్రస్తుతం టెస్ట్ వెర్షన్ లో ఉన్న ఈ రోబో చాలా సామర్థ్యాన్ని కలిగి ఉంది.

త్వరలో వివిధ రంగాల్లో ఈ రోబోను ఉపయోగించుకోవచ్చని విద్యార్థులు తెలిపారు.

ఆ హీరో నో చెప్పడం బాధించింది.. వైరల్ అవుతున్న గౌతమ్ మీనన్ కామెంట్స్!