విద్యాబుద్ధులు నేర్పిన గురువు కు విద్యార్థుల చేయూత

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన ఆకుల వేణు కు పూర్వ విద్యార్థులు ఆర్థిక సహాయం అందించి పలువురి కి ఆదర్శంగా నిలిచారు.

ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో సోషల్ లెక్చరర్ గా విద్యాబుద్ధులు నేర్పిన గురువు ఆకులు వేణు ( Venu )తల్లి పక్షవాతం వ్యాధి సోకి గత సంవత్సర కాలంగా మంచం పట్టింది.

ఆమెకు సేవ చేసుకోవడానికి వేణు హైదరాబాదులో ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం వదులుకొని ఇల్లు చేరాడు.

ఈ విషయం తెలుసుకున్న పూర్వ విద్యార్థులు బింగి బాబు యాదవ్, దినేష్ గౌడ్, పెంటం రాజశేఖర్, జీడి శ్రవణ్ కుమార్, చిన్న బాలు రాహుల్, బసవపురం కృష్ణ,రాగుల సాయి కిరణ్, సనుగుల సతీష్, తుమ్మనపల్లి రాజేష్, చిట్టి రాజ్ కుమార్, శ్రీరామోజి ప్రవీణ్ లు పదివేల రూపాయల ఆర్థిక సహాయాన్ని వేణు కు అందజేశారు.

టోవినో థామస్ ”ఏఆర్ఎమ్” (ARM) తెలుగు ట్రైలర్ విడుదల !!