తరగతి గదిలో పుష్ప పాటలకు డాన్స్ వేసిన స్టూడెంట్స్... సస్పెండ్ అయిన ప్రిన్సిపాల్?

అల్లు అర్జున్ రష్మిక నటించిన పుష్ప సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే.

ముఖ్యంగా ఈ సినిమా సౌత్ ఇండస్ట్రీలో కన్నా నార్త్ ఇండస్ట్రీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.

ఈ సినిమా విడుదలై ఐదు నెలలు అవుతున్నప్పటికీ ఇంకా పుష్ప సినిమా ఫీవర్ తగ్గలేదని చెప్పాలి.

ప్రతిరోజు ఈ సినిమాకి సంబంధించి ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఇక ఈ సినిమాలో పాటలు డైలాగులు ఎంతో అద్భుతంగా ఉన్నాయని చెప్పాలి.ఈ క్రమంలోనే ఈ సినిమాలోని పాటలకు ఎంతోమంది డాన్స్ రీల్స్ చేస్తూ ఆ వీడియోలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.

ఇలా పుష్ప మేనియా ఎక్కడ తగ్గేదే లే అన్నట్టుగా క్రేజ్ సంపాదించుకుంది.ఇదిలా ఉండగా తాజాగా ఒడిశాలోని బారాముండాలి జిల్లాలోని హైస్కూల్‌లో పదో తరగతి పరీక్షల నేపథ్యంలో ఉపాధ్యాయులు పదవ తరగతి విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు.

ఇలా తరగతిగదిలో స్మార్ట్ టీవీ ఏర్పాటు చేసి పదవ తరగతి విద్యార్థులకు శిక్షణ తరగతులు నిర్వహించారు.

తరగతులు నిర్వహించిన అనంతరం ఉపాధ్యాయులు తరగతి గదికి తాళం వెయ్యకుండా వెళ్లిపోగానే క్లాస్ రూమ్ లో విద్యార్థులు పుష్ప సినిమాలో పాటలు పెట్టుకుని డాన్స్ చేశారు.

ఇలా కొందరు విద్యార్థులు డాన్స్ చేస్తుండగా మరికొందరు ఈ దృశ్యాలను వీడియో చేశారు.

ఈ క్రమంలోనే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇక ఈ వీడియో చూసిన విద్యాశాఖ అధికారులు తరగతిగది పట్ల నిర్లక్ష్యం వహించడంతో ప్రిన్సిపాల్ కి విద్యా శాఖ నోటీసులు పంపి స్కూల్ ప్రిన్సిపాల్ ను సస్పెండ్ చేశారు.