తెలంగాణలో స్టూడెంట్స్ అకడమిక్ వెరిఫికేషన్ సర్వీస్ వెబ్‎సైట్

తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి కీలక నిర్ణయం తీసుకుంది.స్టూడెంట్స్ అకడమిక్ వెరిఫికేషన్ సర్వీస్ వెబ్‎సైట్ ను అందుబాటులోకి తెచ్చింది.

ఈ మేరకు వెబ్‎సైట్ ను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు.

నకిలీ సర్టిఫికెట్లకు చెక్ పెట్టేందుకు దీనిని ఏర్పాటు చేశారు అధికారులు.కాగా ఈ సర్వీస్ కోసం ఏడాది కాలంగా రాష్ట్ర ఉన్నత విద్యామండలి పోలీస్ శాఖతో కలిసి పని చేస్తోన్న విషయం తెలిసిందే.

కాగా ఈ వెబ్‎సైట్ లో 2010 నుంచి 2021 వరకు రాష్ట్రంలో అందుబాటులో ఉన్న వివిధ కోర్సుల విద్యార్హత సర్టిఫికేట్ల వివరాలను పోర్టల్ లో అందుబాటులో ఉండనున్నాయి.

ఈ పోర్టల్ ద్వారా సర్టిఫికేట్లు ఒరిజనాలా లేదా అన్న వివరాలను తెలుసుకోవడానికి ఎలాంటి ఫీజు ఉండదని అధికారులు తెలిపారు.

మార్కుల శాతం వివరాలను తెలుసుకోవాలంటే ఆన్లైన్లోనే కొంత ఫీజు చెల్లించాల్సి ఉంటుందన్నారు.

మోచేతుల నలుపును సహజంగా పోగొట్టే పవర్ ఫుల్ రెమెడీ ఇది!