వైరల్: సీసీ కెమెరాపై స్లిప్స్ విసిరేసిన స్టూడెంట్… చేసిందే తప్పు, పైగా ఫ్రస్ట్రేషన్?

సోషల్ మీడియాలో( Social Media ) మీరు ఎన్నో వైరల్ వీడియోలను చూస్తూ వుంటారు.

అయితే ఇలాంటి వీడియోని ఎక్కడా ఇంతవరకు చూసి వుండరు.అందుకే దీనిని ఇపుడు వైరల్ వీడియోలకు బాబు అని పిలుస్తున్నారు.

సాధారణంగా ఈతరం యువతకి కాస్త పిచ్చి ఎక్కువే.ఆనందాన్ని తట్టుకోలేరు, బాధను తట్టుకోలేరు.

ఇక ఫ్రస్ట్రేషన్ అయితే అస్సలే ఆపుకోలేరు.వెంటనే ఎదుటివాళ్ళ దగ్గర చూపిస్తూ వుంటారు.

అయితే వాటికి సరియైన కారణాలు ఉండాలి.చేసిందే పెద్ద తప్పు అయినపుడు ఇక్కడ వీడియోలో కనిపిస్తున్న స్టూడెంట్ ఫ్రస్ట్రేషన్( Student Frustration ) చూడండి.

బయట కనిపిస్తే మీకు వాడిని కొట్టాలనిపిస్తుంది. """/" / ఈకాలం కుర్రాళ్ళకి ఏం పోయేకాలం వచ్చిందో కానీ, అన్ని ఈజీగా దొరికేయాలి అనుకుంటారు.

ఆఖరికి పరీక్షలు సరిగ్గా రాయకుండానే పాస్ కావాలని ఆశ పడుతూ వుంటారు.ఈ క్రమంలో చాలామంది ప్రబుద్ధులు కాపీకొడుతూ వుంటారు.

దీనికోసం స్లిప్స్ పెడుతూ వుంటారు.అలా పాస్ అయినవారు జీవితంలో పెద్దగా ఎదిగిన దాఖలాలు లేవనుకోండి.

అది వేరే విషయం.ఇక్కడ కూడా అదే జరిగింది.

వైరల్ అవుతున్న వీడియోని ఒకసారి పరిశీలిస్తే.పరీక్షలు( Exams ) జరిగిన హాలునుండి పరీక్ష పూర్తైన తరువాత తన వెంబడి తెచ్చుకున్న స్లిప్స్ ని ఓ యువకుడు, బయటకు తీసి లెక్కపెడుతూ సీసీ కెమెరాకు చూపించి మరీ దానిపై విసరడం గమనించవచ్చు.

"""/" / కాగా ఇన్‌స్టా ఖాతా నుంచి పోస్ట్ అయిన సదరు వీడియో సోషల్ మీడియాలో రికార్డు స్థాయిలో వ్యూస్ రాబడుతోంది.

కాగా ఈ వీడియోను చూసిన నెటిజన్లు కొంతమంది నవ్వుకుంటుంటే కొంతమంది బాధ్యత గలవాళ్ళు మాత్రం వాడికి ఓ రేంజులో ఏసుకుంటున్నారు.

కొంతమంది 'వచ్చిన ప్రశ్నలకు, తెచ్చిన స్లిప్స్‌కి సంబంధం లేదనుకుంటా?' అని కామెంట్ చేస్తే.

'చేసిందే ఎదవ పని, పైగా ఫ్రస్ట్రేషన్ దేనికిరా? ఎదో సాధించినట్టు!' అని కొంతమంది కామెంట్ చేస్తున్నారు.

కొంతమందైతే అతగాడిని పట్టుకొని ఏకంగా 10 సంవత్సరాలు డిబార్ చేయమని కోరుతున్నారు.

చిన్న పని చేస్తే చాలు.. ప్రభాస్ సలార్ బైక్ మీ సొంతం చేసుకోవచ్చు?