కోదాడ స్నేహ నర్సింగ్ కళాశాలలో విద్యార్థిని ఆత్మహత్యాయత్నం

సూర్యాపేట జిల్లా: కోదాడ పట్టణంలోని స్నేహ నర్సింగ్ కళాశాల హాస్టల్లో ఉండి ద్వితీయ సంవత్సరం చదువుతున్న అస్సాం రాష్ట్రానికి చెందిన నర్గెస్ పర్బిన్ అనే విద్యార్థిని బుధవారం రాత్రి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన కలకలం రేపింది.

దీనితో ఆమెను హాస్టల్ వార్డెన్ హుటాహుటిన స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.ప్రస్తుతం ఆమె అసుకత్రిలో చికిత్స పొందుతూ కోలుకుంటున్న సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

బాధిత విద్యార్థిని తెలిపిన వివరాల ప్రకారం.స్నేహ నర్సింగ్ కళాశాల యాజమాన్యం ఫీజు చెల్లించాలని ఇబ్బందులు గురి చేశారని,ఆ వేధింపులు తట్టుకోలేక హ్యాండ్ శానిటైజర్ తాగి ఆత్మహత్యయత్నానికి ప్రయత్నించినట్లు ఆవేదన వ్యక్తం చేసింది.

కళాశాలలో ఏదైనా సమస్యలు ఎదురైనప్పుడు యాజమాన్యంతో మాట్లాడితే ఇష్టం వచ్చినట్లు దూషిస్తున్నారని తెలిపింది.

అసలే అమ్మాయిలం హాస్టల్లో సరైన సౌకర్యాలు లేక నానా ఇబ్బందులు పడుతున్నామని వాపోయింది.

ఇదిలా ఉంటే బాధిత విద్యార్థినికి ట్రీట్మెంట్ జరుగుతూనే ఉంది.కానీ,యాజమాన్యం మాత్రం పత్తా లేకుండా పోవడంతో బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

దీనిపై టౌన్ పోలీస్ స్టేషన్ కు ఫిర్యాదు చేయగా టౌన్ ఎస్ఐ రంజిత్ రెడ్డి కళాశాలను సందర్శించి విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడానికి కారణాలను సహ విద్యార్థులను అడిగి తెలుసుకొని బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తామని తెలిపారు.

దీనిపై కళాశాల యాజమాన్యాన్ని వివరణ అడగగా కళాశాల ఫీజు అడిగడం వలన ఈ విధంగా చేసుకుందని తెలిపారు.

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఇంట తీవ్ర విషాదం.. అసలేం జరిగిందంటే?