నీట్ విద్యార్ధిని ఆత్మహత్యకి ముందు ఏం జరిగిందో తెలుసా.? ఆమె తల్లి ఏం చేసిందంటే.?
TeluguStop.com
హైదరాబాద్ అబిడ్స్ లో విషాదం చోటు చేసుంది.మయూరి బిల్డింగ్ పై నుంచి దూకి కాచిగూడకు చెందిన జెస్లీస్ కౌర్ ఆత్మహత్య చేసుకుంది.
నీట్ పరీక్షలో తక్కువ మార్కులు రావడంతోనే ఈ అఘాయిత్యం చేసుకున్నట్లు చెబుతున్నారు బంధువులు.
వివరాల లోకి వెళ్తే.మంగళవారం ఉదయం తొమ్మిదిన్నర గంటల సమయంలో మయూరి బిల్డింగ్ లోకి కౌర్ వెళ్లినట్లుగా సీసీ కెమెరాల్లో రికార్డైంది.
నేరుగా 9వ అంతస్తుపైకి వెళ్లింది.అక్కడ్నుంచి కిందకు దూకింది.
బిల్డింగ్ పైనుంచి దూకుతున్నప్పుడు చుట్టుపక్కల వారు, కింద ఉన్న వారు కేకలు వేశారు.
దూకొద్దు అని అరిచారు.దూకితే ఎలా రక్షించాలని కొందరు ఆలోచన చేస్తున్నారు.
మరికొందరు పోలీసులకు ఫోన్ చేశారు.మరికొందరు కాపాడేందుకు బిల్డింగ్ పైకి పరిగెత్తారు.
మరికొందరు దుప్పటాలు, కవర్లు తెచ్చి కింద పడకుండా కాపాడాలని ప్రయత్నాలు చేస్తున్నారు.అందరూ ఎవరికి వారు కాపాడాలనే ఆలోచనలో ఉండగానే జరగరాని ఘోరం జరిగిపోయింది.
Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/
H3తల్లి ఓదార్చినా స్వాంతన లేదు:/h3
ఆమె ఇంట్లో చెప్పి వచ్చిన తర్వాత ఆ భవనంపై స్కూటీని పార్క్ చేసింది.
పైకి వెళ్లిన తర్వాత అందరూ వద్దని అరుస్తుండగా ఆమె కళ్లు మూసుకొని కిందకు దూకేసింది.
నీట్‌లో మంచి ర్యాంకు రాలేదని ఆ యువతి తల్లి వద్ద కంటతడి పెట్టింది.
కానీ ఆ తల్లి ఆమెను ఓదార్చింది.మరోసారి ప్రయత్నిస్తే మంచి ర్యాంకు వస్తుందని ధైర్యం చెప్పింది.
తల్లి ధైర్యం చెప్పినా జస్లీన్‌కు స్వాంతన చేకూరలేదు.ఒత్తిడిలో అఘాయిత్యానికి పాల్పడి కుటుంబానికి తీరని శోకం మిగిల్చింది.
పరీక్షలు బాగానే రాసినట్లు నీట్ రాసిన అంతరం తల్లిదండ్రులతో సహా అందరికీ చెప్పింది.
!--nextpage
H3లిఫ్టులో ఎక్కితే అడుగుతారని:/h3
భవనంలోకి నాలుగు దారులు ఉన్నాయి.చివరి దారిలో నుంచి లోనికి వెళ్లింది.
లిఫ్టులో వెళ్తే ఎవరైనా అనుమానంతో ప్రశ్నిస్తారని జస్లీన్ పది అంతస్తులను మెట్ల ద్వారా ఎక్కిందని తెలుస్తోంది.
ఆరో అంతస్తు వద్ద సీసీ కెమెరాలో అమె మెట్లు ఎక్కుతున్న దృశ్యాలు ఉన్నాయి.
పది అంతస్తుల తర్వాత భవనం పైభాగానికి వెళ్లేందుకు రెండు గేట్లు ఉన్నాయి.మరమ్మతుల కారణంగా రెండింటిని తెరిచే ఉంచారు.
ఒకదాని గుండా ఆమె భవనం పైకి ఎక్కింది.ఇప్పటి వరకైతే ఆమె మరణంపై అనుమానాలు లేవని పోలీసులకు చెప్పారు.
తల్లిదండ్రులు హైదరాబాద్‌లో లేరు.వారు వచ్చి అనుమానాలు వ్యక్తం చేస్తే దర్యాప్తును ఆ దిశగానూ కొనసాగిస్తామని పోలీసులు మంగళవారం తెలిపారు.
H3ఉదయం వెళ్లి రాకపోవడంతో ఆందోళన:/h3
జస్లిన్ భవనం పై నుంచి దూకిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఉదయం వెళ్లిన జస్లిన్ తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు చెందారు.ఆమె ఫోన్ స్విచ్చాఫ్ రావడంతో ఆందోళనకు లోనయ్యారు.
చిన్నాన్న సురేందర్ సింగ్ కాచిగూడ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు.ఇంతలో కొందరి వాట్సాప్ గ్రూప్ ద్వారా జస్లిన్ విషయం తెలియడంతో వారు కుప్పకూలిపోయారు.
వెంటనే ఉస్మానియా ఆసుపత్రికి వెళ్లారు.ఆమె మృతితో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి.
వివేక్ రామస్వామి పదవిపై డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన