వైరల్: మ్యారేజ్ అంటే ఏంటనే ప్రశ్నకు ఈ స్టూడెంట్ హిలేరియస్ ఆన్సర్..

విద్యార్థులలో కేవలం సబ్జెక్టు జ్ఞానమే కాకుండా ప్రపంచంలోని అన్ని అంశాలలో అవగాహన పెంచేందుకు టీచర్లు అప్పుడప్పుడు ఎస్సై రైటింగ్ పెడుతుంటారు.

ఒక్కోసారి పరీక్షలలో కూడా కొత్త ప్రశ్నలు అడుగుతుంటారు.ఆయా అంశాలపై విద్యార్థులకు ఎంతవరకు నాలెడ్జ్ ఉంది? వారి రైటింగ్ సామర్థ్యం ఎంత అనేది తెలుసుకునేందుకు టెస్ట్స్‌ పెడుతుంటారు.

అయితే తాజాగా ఒక సోషల్ స్టడీస్ టీచర్ తన స్టూడెంట్స్‌కి మ్యారేజ్ అంటే ఏంటో రాయాలని ఒక క్వశ్చన్ ఇచ్చారు.

కాగా ఈ 10 మార్కుల ప్రశ్నకు ఒక విద్యార్థి చాలా ఫన్నీగా సమాధానమిచ్చాడు.

ఈ ఆన్సర్ పేపర్‌కి సంబంధించిన ఫొటో ఇప్పుడు ట్విట్టర్‌లో వైరల్‌గా మారింది.@srpdaa అనే ట్విట్టర్ యూజర్ పోస్ట్ చేసిన ఫొటోలో ఈ ఆన్సర్ పేపర్‌ కనిపించింది.

దీనిని చదివి నెటిజన్లు బాగా నవ్వుకుంటున్నారు.ఈ ట్వీట్‌కి ఇప్పటికే 12 వేలకు పైగా లైక్స్ వచ్చాయి ఈ ఆన్సర్ పేపర్‌లో .

"ఒక అమ్మాయి తల్లిదండ్రులు ఆమెకు పెళ్లి చేసుకోమని చెప్పినప్పుడు వివాహం జరుగుతుంది.తల్లిదండ్రులు తమ అమ్మాయికి 'ఇప్పుడు నువ్వు పెద్ద మహిళవి.

ఇక మేం నీకు తిండి పెట్టలేం.వెళ్లి నీకు తిండి పెట్టే వ్యక్తిని వెతుక్కోవడం మంచిది.

' అని చెప్తారు.అప్పుడు ఆ అమ్మాయి ఒక వ్యక్తిని కలుసుకుంటుంది.

అతని తల్లిదండ్రులు అతనిని పెళ్లి చేసుకోమని అరుస్తారు. """/"/ నువ్వు ఇప్పుడు పెద్ద వాడివి అయ్యావు.

ఆమెను పెళ్లి చేసుకో అంటారు.ఆపై ఇద్దరూ పెళ్లి చేసుకుంటారు.

అనంతరం కలిసి జీవించడానికి అంగీకరించి, పిల్లలను కనడానికి అర్ధంలేని పని చేయడం ప్రారంభిస్తారు.

'' అని ఆ స్టూడెంట్ రాశాడు.దీనిని చదివిన టీచర్ అవాక్కయింది.

ఆపై ఈ సమాధానానికి పదికి సున్నా మార్క్‌లు ఇచ్చింది.'నాన్సెన్స్' అని కూడా పేపర్ పై ఒక రిమార్క్ రాసింది.

దీనిని చదివి నెటిజన్లు నవ్వుకుంటున్నారు.అయితే కొందరు మాత్రం మూడో తరగతి విద్యార్థి ఇంగ్లీష్ లో ఇంత బాగా రాయగలడా.

ఇది బహుశా ఫేక్ అయి ఉంటుంది అని అభిప్రాయపడుతున్నారు.ఇంకొందరు మాత్రం వామ్మో ఈ రోజుల్లో పిల్లలు ఇలానే ఉన్నారు.

యూట్యూబ్ వీడియోలు చూస్తున్నాం కదా.బుడ్డ విద్యార్థులు ఎంతేసి మాటలు మాట్లాడుతున్నారో అని కామెంట్స్ చేస్తున్నారు.

వైరల్: జలుబు చేసిందని ఇంగ్లీషులో యజమానికి చెబుతున్న చిలుక!