ఉపమాలంకారం గురించి ఈ చిన్నోడి రాసిన ఆన్సర్ చూస్తే పొట్ట చెక్కలవ్వాల్సిందే..!?

సోషల్ మీడియాలో ఫన్నీ ఫొటోలు, వీడియోలకు కొదవలేదు.వీటిలో పెద్దవారి నుంచి చిన్న పిల్లల వరకు అనేకమంది చేసిన చిలిపి చేష్టలకు సంబంధించిన కంటెంట్ ఉంటుంది.

ఇక విద్యార్థుల ఫన్నీ ఫోటోలు, వీడియోలు కూడా చాలామందిని ఆకర్షిస్తాయి.మామూలుగా పిల్లలకు ఎగ్జామ్స్ అంటే చాలా భయం వేస్తుంది.

ఫెయిల్ అయిపోతామేమోనని టీచర్లు( Teacher ) పనిష్ చేస్తారేమో అని ఆందోళన ఉంటుంది.

కనీసం పాస్ మార్కులు అయినా తెచ్చుకోవాలని చాలామంది పుస్తకం ముందు పెట్టుకుని చదువుతారు.

కొంతమంది మాత్రం చీట్ చేసి ఎగ్జామ్‌ పాస్ అవ్వాలని అనుకుంటారు.ఇక ఇంకొందరు ఆన్సర్ పేపర్లు( Answer Papers ) నింపితే చాలు పాస్ మార్కులు వచ్చేస్తాయని కథలు, కవిత్వాలు రాసేస్తుంటారు.

తాజాగా ఒక విద్యార్థి( Student ) కూడా ఇలాంటి పని చేశాడు.అతడు ఒక ప్రశ్నకు రాసిన సమాధానం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

"""/" / ఆ స్టూడెంట్ ఎగ్జామ్ పేపర్‌లో అతి తెలివిగా రాసిన ఆన్సర్ చూసి సోషల్ మీడియా యూజర్లు పొట్టనొప్పి వచ్చేంతలా నవ్వుకుంటున్నారు.

ఈ పిల్లోడు ఇటీవల ఒక తెలుగు పరీక్షకు హాజరయ్యాడు.ఆ తెలుగు క్వశ్చన్ పేపర్‌లో ఉపమాలంకారం( Upamalankaram ) గురించి రాయమని అడిగారు.

అయితే అదేంటో తెలియని సదరు స్టూడెంట్ ఉప్మా తయారీ విధానం గురించి రాశాడు.

ఉపమాలంకారానికి, ఉప్మాకి మధ్య అసలు ఎలాంటి సంబంధం ఉండదు.ఉపమాలంకారం తయారీ విధానం గురించి ఆన్సర్ పేపర్లో ఉంటుందని టీచర్ అసలు ఊహించలేదు.

అందుకే ఆ సమాధానం చూసి బిత్తరపోయాడు.సదరు బ్యాక్ బెంచ్ స్టూడెంట్ ఉప్మా ఎలా తయారు చేయాలో చక్కగా వివరించి, దాని టేస్ట్ కూడా ఎలా ఉంటుందో తెలిపాడు.

"""/" / అయితే ఈ విద్యార్థి రాసిన ఆ ఆన్సర్‌ను అడ్డంగా కొట్టేశాడు టీచర్.

చదువుకోకుండా ఇలాంటి ఉపయోగం లేని సమాధానాలు రాయొద్దని కూడా హెచ్చరించాడు.అయితే సోషల్ మీడియాలో ఈ ఆన్సర్ షీట్ చూసి చాలా మంది నవ్వుకున్నారు.

అసలైన జాతిరత్నం అంటే ఈ స్టూడెంట్‌యే అని చాలామంది కామెంట్ చేశారు.పెద్దయ్యాక పెద్ద వంట గాడు అవుతాడేమో అని మరికొందరు ఫన్నీగా వ్యాఖ్యానించారు.

సరిపోదా శనివారం టీజర్ రివ్యూ.. యాక్షన్ సీన్స్ లో న్యాచురల్ స్టార్ అదరగొట్టాడుగా!