హైదరాబాద్ నిజాం కాలేజ్‎లో విద్యార్థినుల ఆందోళన

హైదరాబాద్ నిజాం కాలేజ్‎లో విద్యార్థినుల ఆందోళన కొనసాగుతోంది.హాస్టల్ బిల్డింగ్ కేటాయించాలని డిగ్రీ విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.

కొత్తగా నిర్మించిన హాస్టల్ బిల్డింగ్ ను పీజీ విద్యార్థులకు ఇవ్వడంపై విద్యార్థినుల నిరసనకు దిగారు.

దూర ప్రాంతాల నుంచి వచ్చే డిగ్రీ విద్యార్థులకు సౌకర్యాలు లేకపోవడంపై తీవ్రంగా మండిపడుతున్నారు.

ఈ నేపథ్యంలో నిన్న విద్యార్థుల ఆందోళనపై స్పందించిన మంత్రి కేటీఆర్ ఈ సమస్యను పరిష్కరించాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి ట్వీట్ చేసిన విషయం తెలిసిందే.

దీనిపై స్పందించిన ఆమె త్వరలోనే పరిష్కరిస్తామని చెబుతూ రీ ట్వీట్ చేశారు.ఇందులో భాగంగానే నిజాం కాలేజ్ ప్రిన్సిపాల్ తో ఇవాళ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమావేశం కానున్నారు.

అయితే లిఖిత పూర్వకంగా హామీ ఇచ్చి తమను కూడా పిలవాలని డిగ్రీ విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.

విద్యార్థినీల నిరసనకు మద్ధతు తెలిపిన విద్యార్థి సంఘాలు ఆందోళన కార్యక్రమం చేపట్టాయి.

దేవర సినిమా గేమ్ ఛేంజర్ కు భారీ టార్గెట్ ఇచ్చిందిగా.. ఆ రేంజ్ కలెక్షన్లు వస్తాయా?