ఐలోని జాతరకు పటిష్ట ఏర్పాట్లు చేయాలి..: మంత్రి కొండా సురేఖ

వరంగల్ జిల్లాలోని ఐలోని జాతరకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని మంత్రి కొండా సురేఖ అన్నారు.

ఐలోని మల్లికార్జున స్వామి వారిని దర్శించుకున్న ఆమె జాతర ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు.

ఈ క్రమంలోనే జాతరకు వచ్చే భక్తులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా అన్ని రకాల చర్యలు చేపట్టాలని మంత్రి కొండా సురేఖ అధికారులకు తెలిపారు.

అలాగే జాతర ప్రాంగణంలో ఎలాంటి చెత్త, చెదారం లేకుండా పరిశుభ్రంగా ఉండేలా చూడాలన్నారు.

వృద్ధులకు, మహిళలకు ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేయాలని ఆమె సూచించారు.కరెంట్ సరఫరాలో అంతరాయం కలగకుండా చూడాలన్న మంత్రి కొండా సురేఖ అత్యవసర సేవలు అందించేందుకు అంబులెన్స్ లను కూడా ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

సైబీరియన్ పులి ప్రేమ ప్రయాణం.. 200 కి.మీ దాటి, ప్రేయసి చెంతకు!