ఇంటర్ సప్లమెంటరీ పరీక్షలకు పటిష్ట బందోబస్తు: ఎస్పీ చందనా దీప్తి

నల్లగొండ జిల్లా: ఈనెల 24 నుండి జూన్ 3 వరకు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12:00 గంటల వరకు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం,మధ్యాహ్నం 2:30 గంటల నుండి సాయంత్రం 5:30 గంటల వరకు ద్వితీయ సంవత్సర సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్న నేపథ్యంలో పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్దులకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు జిల్లా ఎస్పీ చందనా దీప్తి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.

జిల్లా వ్యాప్తంగా పరీక్షా కేంద్రాల సమీపంలో ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు 144 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు.

పరీక్ష కేంద్రాల సమీపంలో ఉన్న అన్ని జిరాక్స్, ఇంటర్ నెట్ సెంటర్స్ మూసేయాలని ఆదేశించారు.

పరీక్షా సెంటర్స్ వద్ద నుండి 500 మీటర్ల వరకు ప్రజలు గుమిగూడ వద్దని,ఎలాంటి సభలు,సమావేశాలు నిర్వహించకూడదని పేర్కొన్నారు.

విద్యార్దులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా పరీక్ష నిర్వహణకు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు.

రెండు నెలల పాటు సావిత్రిని ఏడిపించిన సింగర్ జానకి.. ఎందుకంటే..