నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం – కలెక్టర్ అనురాగ్ జయంతి

రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఖరీఫ్ సాగు కోసం విత్తనాలు, ఎరువులకు ఎలాంటి కొరత లేదని కలెక్టర్ అనురాగ్ జయంతి ఒక ప్రకటనలో స్పష్టం చేశారు.

జిల్లాలో ఖరీఫ్ సాగులో భాగంగా వరి, పత్తి ఇతర పంటల విత్తనాలు, ఎరువులకు ఎలాంటి కొరత లేదని పూర్తిస్థాయిలో అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు.

ఎరువుల దుకాణ డీలర్లు కృత్తిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

అలాగే నకిలీ విత్తనాలు విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.జిల్లాలోని రైతులందరూ ఈ విషయాన్ని గమనించి, ఎవరూ ఆందోళనలకు గురికాకుండా సహకరించాలని కోరారు.

నామినేటెడ్ పోస్టులపై మూడు పార్టీల్లోనూ పోటీ .. భారీ ఆశలతో బీజేపీ