క్రికెట్ బెట్టింగులకు పాల్పడితే కఠిన చర్యలు:జిల్లా ఎస్పీ చందనా దీప్తి

నల్లగొండ జిల్లా:ప్రస్తుతం ఐపీఎల్ క్రికెట్ ( IPL Cricket Oనేపథ్యంలో యువత ఈజీ మనీ కోసం క్రికెట్ బెట్టింగ్ కు పాల్పడుతున్నారని, అలాంటి వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని నల్లగొండ జిల్లా ఎస్పీ చందనా దీప్తి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.

క్రికెట్ బెట్టింగ్ ( Cricket Betting )వల్ల ఆర్థికంగా దెబ్బతిని సూసైడ్ చేసుకొని ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉందని, యువత వాటికి దూరంగా ఉండాలని,బెట్టింగ్ కి పాల్పడే వారిపై, నిర్వహుకులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని, బెట్టింగ్ పాల్పడం అత్యంత ప్రమాదకరమని, వినోదం కొరకు ఆడే ఆటను వినోదంగానే చూడాలన్నారు.

ఇలాంటి వాటిలో ఇరుక్కొని యువత జీవితాలను నాశనం చేసుకోవద్దని, బెట్టింగ్,పేకాట వంటి అసాంఘీక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఎవరైనా ఈలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే డయల్ 100 గానీ,సమీప పోలీస్ స్టేషన్ కి సమాచారం తెలపాలని సూచించారు.

రోలెక్స్ పాత్ర గురించి షాకింగ్ అప్ డేట్ ఇచ్చిన సూర్య.. అంచనాలు పెంచాడుగా!