అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు:తాహశీల్దార్ హెచ్చరిక

సూర్యాపేట జిల్లా:అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తప్పవని సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండల తాహశీల్దార్ సురేందర్ రెడ్డి హెచ్చరించారు.

మండల పరిధిలో కృష్టపట్టే గ్రామ ప్రాంతాల నుంచి అక్రమంగా ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుకను తీసి డబ్బింగ్ చేసి అమ్ముతున్నారన్న సమాచారం మేరకు ఆదివారం ఆయన ఆ ప్రాంతాన్ని సందర్శించి పరిశీలించారు.

ఈ సందర్భంగా మండల పరిధిలోని చింత్రియాల రెవెన్యూ గ్రామంలో పర్యటించి అక్కడ నిల్వ చేసిన సుమారు 80 టక్కుల ఇసుకను సీజ్ చేసి పంచాయతీ కార్యదర్శి రామకృష్ణకు హ్యాండోవర్ చేశారు.

ఇసక అక్రమంగా తరలించిన వారిపై నిఘా పెంచాలని పోలీస్ శాఖను ఆదేశించారు.

అనుమతులు లేకుండా ఇసుక తరలించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.

అయాన్ క్రేజ్ చూస్తే పిచ్చెక్కిపోతుంది.. అల్లు శిరీష్ కామెంట్స్ వైరల్!