బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తే కఠిన చర్యలు:టూ టౌన్ సిఐ నాగార్జున
TeluguStop.com
నల్లగొండ జిల్లా:బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తూ ప్రజలకు అసౌకర్యం కలిగిస్తే సహించేదిలేదని మిర్యాలగూడ టూ టౌన్ సీఐ నాగార్జున అన్నారు.
ఆదివారం రాత్రి నల్లగొండ జిల్లా ( Nalgonda District )మిర్యాలగూడ టూ టౌన్ పరిధిలో చేపట్టిన ఆకస్మిక తనిఖీలో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్న 10 మందిని గుర్తించి,కేసు నమోదు చేయడంతో పాటుగా కౌన్సిలింగ్ ఇచ్చారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బహిరంగ ప్రదేశాల్లో మద్యపానం సేవించే వారిపై నిరంతర నిఘా ఉంటుందని,రాత్రి వేళల్లో రోడ్లపై హల్చల్ చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
బహిరంగ ప్రదేశాలలో ఎవరైనా మద్యం సేవిస్తే డయల్ 100 ద్వారా సమాచారం ఇవ్వాలని స్థానికులను కోరారు.
ఈ తనిఖీల్లో మిర్యాలగూడ టూ టౌన్ ఎస్ఐలు,ట్రాఫిక్ ఎస్ఐ, సిబ్బంది పాల్గొన్నారు.
మహేష్ బాబు బాలయ్య కాంబో లో మిస్ అయిన సినిమా ఏంటో తెలుసా..?