బాధ్యులపై కఠిన చర్యలు..అధికారులకు ఏపీ డీజీపీ ఆదేశం
TeluguStop.com
ఏపీలో ఎన్నికల పోలింగ్ ముగిసిన తరువాత చోటు చేసుకుంటున్న హింసపై రాష్ట్ర డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా( Harish Kumar Gupta ) ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.
ఇప్పటికే సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాలు మోహరించిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులు 144 సెక్షన్( Section 144) విధించారు.
అదేవిధంగా పలు రాజకీయ పార్టీలకు చెందిన నేతలను హౌస్ అరెస్ట్( House Arrest) చేసిన పోలీసులు వారి భద్రతలను కట్టుదిట్టం చేశారు.
ఈ క్రమంలోనే ఘటనకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్పీలకు, రేంజ్ డీఐజీలకు, ఐజీలకు డీజీపీ హరీశ్ కుమార్ కీలక ఆదేశాలు జారీ చేశారు.
జమ్మలమడుగు, పల్నాడు, తాడిపత్రి మరియు తిరుపతి జిల్లాల్లో జరుగుతున్న దాడులను డీజీపీ క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.
How Modern Technology Shapes The IGaming Experience