అక్రమ మట్టి తవ్వకాలు, తరలింపులపై కఠిన చర్యలు..ఏడీ మైన్స్ ఎం.రఘుబాబు

చెరువు మట్టిని అక్రమంగా నిల్వ చేసినందుకు గానూ జరిమానా విధించిన అధికారులు.రాజన్న సిరిసిల్ల జిల్లా :అక్రమ మట్టి తవ్వకాలు, నిల్వలు, తరలింపులపై కఠిన చర్యలు తప్పవని, చట్ట ప్రకారం మైనింగ్ అధికారుల ముందస్తు అనుమతి తప్పనిసరి తీసుకోవాలని మైనింగ్ శాఖ సహాయ సంచాలకులు ఎం.

రఘుబాబు తెలిపారు.మంగళవారం బోయినిపల్లి( Boinipally ) మండలం కేంద్రంలో 567 సర్వే నెంబర్ గల స్థలంలో అక్రమంగా నిల్వ చేసిన సుమారు 1500 మెట్రిక్ టన్నుల చెరువు మట్టిని గుర్తించి, 1 లక్షా 80 వేల రూపాయల జరిమానా విధించి, ప్రభుత్వ ఖజానాలో జమ చేశారు.

అక్రమ మట్టి తవ్వకాలు, రవాణాపై మార్చి 31 వరకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు.

జిల్లాలో ఎక్కడైనా ఖనిజాలను తవ్వడం, నిల్వ చేయడం, రవాణా చేయాలంటే ముందస్తుగా మైనింగ్ శాఖ నుండి అనుమతి పొందాలని, లేకపోతే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఏడీ స్పష్టం చేశారు.

జిల్లా పరిధిలో ఎక్కడైనా అక్రమంగా మట్టిని తరలించినా, తవ్వకాలు చేసినా, నిల్వ చేసినా సమాచారం అందించాలని తెలిపారు.

బాలయ్య కొత్త మూవీకి అనిరుధ్ మ్యూజిక్.. బీజీఎంతో బాక్సాఫీస్ షేక్ కావడం పక్కా!